మెటల్ బాడీ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో Huawei Y6 Pro లాంచ్

Updated on 16-Oct-2017

చైనా స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ హువావే  తన కొత్త హ్యాండ్ సెట్ హువావే వై 6 ప్రో (2017) ని లాంచ్ చేసింది . ఈ ఫోన్ ఈ సంవత్సరం లాంచ్ అయిన Y6 కి ఒక అప్గ్రేడ్ . మునుపటి ఫోన్లతో పోలిస్తే, ప్రత్యేక లక్షణాలు  Y6 ప్రోలో ఇవ్వబడ్డాయి.  కంపెనీ ఫింగర్ ప్రింట్  సెన్సార్, మెటల్ బాడీ దీనిలో  ఇచ్చింది . ఈ ఫోన్ యొక్క specs మరియు ధర గురించి  తెలుసుకుందాం పదండి .

Huawei Y6 Pro (2017)  ధర  189  యూరో అంటే సుమారు  14,450 రూ .  దీనిలో  5  ఇంచెస్  720×1280  పిక్సల్స్ హెచ్డీ ips  డిస్ప్లే కలదు .  ఆండ్రాయిడ్ 7.0  నౌగాట్ ఫై ఆదారిత మైనది . Huawei Y6 Pro లో క్వాలకామ్  స్నాప్ డ్రాగన్ 425 చిప్సెట్ కలదు. ఫోన్ లో  16 జీబీ స్టోరేజ్ కలదు . ఇది మైక్రో ఎస్డీ కార్డ్  ద్వారా  ఎక్స్ పాండ్ చేయొచ్చు . 2 జీబీ RAM  కలదు .  13 ఎంపీ రేర్  కెమెరా అండ్  5 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలవు .  Huawei Y6 Pro (2017) లో  3020 mAh  బ్యాటరీ  కలదు .  బరువు 145  గ్రాములు .  కనెక్టివిటీ కి వైఫై 802.11 బి /జి /ఎన్ , బ్లూటూత్  4.1, GPS / A-GPS, గ్లోనాస్  మరియు మైక్రో- USB లు వున్నాయి . ఇది బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో అందుబాటులో కలదు .   ఇది ఎప్పుడు ఇండియా లో లభ్యం అన్నది ఇంకా సరైన సమాచారం లేదు . 

 

Connect On :