మెటల్ బాడీ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో Huawei Y6 Pro లాంచ్
చైనా స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ హువావే తన కొత్త హ్యాండ్ సెట్ హువావే వై 6 ప్రో (2017) ని లాంచ్ చేసింది . ఈ ఫోన్ ఈ సంవత్సరం లాంచ్ అయిన Y6 కి ఒక అప్గ్రేడ్ . మునుపటి ఫోన్లతో పోలిస్తే, ప్రత్యేక లక్షణాలు Y6 ప్రోలో ఇవ్వబడ్డాయి. కంపెనీ ఫింగర్ ప్రింట్ సెన్సార్, మెటల్ బాడీ దీనిలో ఇచ్చింది . ఈ ఫోన్ యొక్క specs మరియు ధర గురించి తెలుసుకుందాం పదండి .
Huawei Y6 Pro (2017) ధర 189 యూరో అంటే సుమారు 14,450 రూ . దీనిలో 5 ఇంచెస్ 720×1280 పిక్సల్స్ హెచ్డీ ips డిస్ప్లే కలదు . ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఫై ఆదారిత మైనది . Huawei Y6 Pro లో క్వాలకామ్ స్నాప్ డ్రాగన్ 425 చిప్సెట్ కలదు. ఫోన్ లో 16 జీబీ స్టోరేజ్ కలదు . ఇది మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్ పాండ్ చేయొచ్చు . 2 జీబీ RAM కలదు . 13 ఎంపీ రేర్ కెమెరా అండ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలవు . Huawei Y6 Pro (2017) లో 3020 mAh బ్యాటరీ కలదు . బరువు 145 గ్రాములు . కనెక్టివిటీ కి వైఫై 802.11 బి /జి /ఎన్ , బ్లూటూత్ 4.1, GPS / A-GPS, గ్లోనాస్ మరియు మైక్రో- USB లు వున్నాయి . ఇది బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో అందుబాటులో కలదు . ఇది ఎప్పుడు ఇండియా లో లభ్యం అన్నది ఇంకా సరైన సమాచారం లేదు .