కొత్త టెక్నాలజీ Force టచ్ తో Huawei mate S రిలీజ్
అన్నీ హై ఎండ్ స్పెక్స్
బెర్లిన్ లో జరుగుతున్న IFA గ్లోబల్ electornic షో లో huawei కొత్త మోడల్ రిలీజ్ చేసింది. దీని పేరు huawei Mate S. దీని ప్రత్యేకత లేటెస్ట్ టెక్నాలజీ, ఫోర్స్ టచ్. ఇది ఐ ఫోన్ 6S మోడల్ లో ఉంటుంది అని రిపోర్ట్స్.
స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 4g LTE, 5.5 in ఎమోలేడ్ స్క్రీన్ FHD 2.5D గొరిల్లా గ్లాస్ 4 మెటాలిక్ బాడీ డిస్ప్లే, 2.2GHz ఆక్టో కోర్ కిరిన్ 935 SoC, 3gb ర్యామ్, 32gb ఇంటర్నెల్ స్టోరేజ్, 2700 mah బ్యాటరీ, emotion యూజర్ ఇంటర్ఫేస్ 3.1 తో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ పై రన్ అవుతుంది. 64gb అండ్ 128 gb వేరియంట్స్ కూడా వస్తున్నాయి.
13MP OIS డ్యూయల్ కలర్ temp LED ఫ్లాష్ రేర్ కెమేరా అండ్ 8MP ఫ్రంట్ కెమేరా. బ్యాక్ ప్యానల్ లో అప్ గ్రేడ్ వెర్షన్ 2.0 తో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది ఫింగర్ అన్ లాక్ స్కానింగ్ మాత్రమే కాదు, ఫోటోస్ స్క్రోలింగ్, కంట్రోలింగ్ నోటిఫికేషన్స్, కాల్స్ attend చేయటం, అలారం ఆపటం వంటి పనులు కూడా చేస్తుంది.
Force touch అనేది లైట్ గా టాప్ చేస్తే ఒక యాక్షన్ మరియు ఫోర్స్ గా టచ్ చేస్తే మరొక యాక్షన్ ఇస్తుంది. మొదటి సారిగా huawei అందిస్తుంది ఈ ఫీచర్. ఆపిల్ కన్నా ముందు ఫోర్స్ టచ్ ఫీచర్ తో ఫోన్ లాంచ్ చేయటంతో ఆపిల్ బీట్ చేసింది huawei. 30 కు పైగా దేశాలలో అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 15 నుండి వెస్ట్రన్ యూరోప్ యూజర్స్ ప్రీ ఆర్డర్ చేయవచ్చు.
ఆధారం: huawei