HIGHLIGHTS
ఫుల్ మెటల్ బాడీ, మరియు 20MP కెమేరా దీని హై లైట్స్
Huawei హానర్ బ్రాండ్ నుండి లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ నిన్న చైనా లో లాంచ్ అయ్యింది. జులై 7 నుండి చైనా లో సేల్ అవనుంది. హానర్ 7 పేరుతో రిలీజ్ అయిన ఇది హానర్ 6 మరియు 6 ప్లస్ డిజైన్ మాదిరి గానే ఉంది. 16 GB ధర 20,500 రూ. 64 GB ధర 25,650 రూ. కొన్ని నెలలో ఇండియాలో కి వస్తుంది హానర్ 7.
సింపుల్ గా స్ట్రయిట్ గా దీని గురించి…
- గోల్డ్, సిల్వర్, గ్రే కలర్స్ లో వస్తుంది.
- సామ్సంగ్ A సిరిస్ స్మార్ట్ ఫోన్ వంటి unibody మెటల్ బాడీ ఉంది హానర్ 7 లో.
- HiSilicon కిరిన్ 935 ఆక్టో కోర్ (నాలుగు 2.2 GHz కార్టెక్స్ A53 ప్రొసెసర్స్ మరియు నాలుగు 1.5GHz కార్టెక్స్ A53 ప్రాసెసర్స్).
- మాలి T628 గ్రాఫిక్స్ GPU
- 3GB ర్యామ్
- 16GB మరియు 64GB స్టోరేజ్ వెర్షన్స్
- 20MP కెమేరా ఆటో ఫోకస్ డ్యూయల్ LED ఫ్లాష్ మరియు 8MP ఫ్రంట్ కెమేరా
- ఫోన్ వెనుక కెమేరా క్రింద ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 5.2 ఇన్ డిస్ప్లే ఎమోషన్ UI 3.1, ఆండ్రాయిడ్ లాలిపాప్
- 3100 mah బ్యాటరీ