ఇప్పుడు హువావే తరువాతి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోనుకోసం కాపీని యొక్క ప్రస్తుత ట్రన్డ్ అయినటువంటి టాప్- నోచ్ కెమేరాని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ప్రముఖ టిప్స్టర్, ఇవాన్ బ్లాస్ (aka@ evleaks) ఈ హువావే పి 30 గరిష్టంగా ఒక 40MP రిజల్యూషన్ కలిగిన ఒక ట్రిపుల్ కెమేరా సేతప్పుతో మరియు 5X లాస్లెస్ జూమ్ సపోర్టుతో ఉండవచ్చని సూచించారు. ముందు భాగంలో, ఒక 24MP యూనిట్ కలిగి ఉండవచ్చు.
ఈ ట్వీట్ లో, బ్లాస్ " ట్రిపుల్ కెమెరా సెటప్పుతో 5X లాస్లెస్ జూమ్ సపోర్టు కలిగిన ఒక 40MP రిజల్యూషన్ కలిగిన ఒక ట్రిపుల్ కెమేరా సేతప్పుతో మరియు 24MP సెల్ఫీ కెమేరాతో, మరొక ఇమేజింగ్ పవర్ హౌస్ గా ఉండవచ్చు. అదికూడా, ఇది ఒక ప్రో డివైజ్ కాకపోయినాసరే". అంటే, ఈ చివరి మాటలను బట్టి ఈ స్మార్ట్ ఫోను యొక్క ప్రో వేరియంట్ మరింత శక్తివంతమైన కెమేరాని కలిగివుండవచ్చని అర్ధమవుతుంది.
బ్లాస్ ఈ డివైజ్ యొక్క ఇతర ప్రత్యేకతలను గురించి వివరించలేదు, కానీ ఈ డివైజ్ కంపెనీ యొక్క ప్రస్తుత ప్రధాన ప్రాసెసెర్ అయినటువంటి kirin 980 ప్రోసెసర్ కలిగి ఉంటుందని మనం భావించవచ్చు. ఈ ప్రాసెసర్ కొన్ని నెలల క్రితం ఆవిష్కరించబడింది మరియు ఇది ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ 7nm చిప్సెట్ అని చెప్పబడింది. ముందున్నటువంటి 10nm ప్రాసెసెరుతో పోలిస్తే, ఈ 7nm ప్రొసెసర్ 20 శాతం అధిక SoC పెర్ఫార్మెన్స్ మరియు 40 శాతం అధిక సామర్ధ్యాన్ని అందిస్తుందని, కంపెనీ తెలిపింది.
అంతేకాకుండా, Cortex A-76కొర్స్ ఉపయోగించే మొట్టమొదటి SoC కూడా ఈ Kirin 980 ప్రాసెసర్ మరియు ఇది ముందున్న వాటికంటే, 75 శాతం అధిక శక్తి మరియు 58 అధిక సామర్ఢ్యన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఈ Kirin 980 ప్రాసెసర్ హుయేవే మేట్ 20 ప్రో స్మార్ట్ ఫోనులో అఫర్ చేయబడింది. అయితే, 7nm చిప్సెట్ తో మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి డివైజ్ మాత్రం ఇది కాదు. హుయేవేని అధిగమించడానికి, ఆపిల్ కోతగా తన A 12 Bionic Chipset తో తన కొత్త లైనప్ స్మార్ట్ ఫోన్లు అయినటువంటి ఐఫోన్ xs, ఐఫోన్ xs మ్యాక్స్, ఐఫోన్ xs XR లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.