ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ HUAWEI Mate XT ను విడుదల చేసిన హువావే.!
హువావే ఈరోజు కొత్త ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ HUAWEI Mate XT ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు మడతలు కలిగిన అతి పెద్ద స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఇప్పటి వరకు మధ్యకి మడత పెట్టే ఫోల్డ్ ఫోన్ లను మాత్రమే చూసాము. అయితే, హువావే మరొక అడుగు ముందు వేసి కొత్త ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. నిన్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ నుంచి కొత్త ఫోన్లు లాంచ్ చేసిన మరుసటి రోజే ఈ ఫోన్ విడుదల చేసింది. ఈ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ ను చైనా మార్కెట్ లో ఈరోజు హువావే విడుదల చేసింది.
HUAWEI Mate XT : ఫీచర్స్ (చైనా)
ఈ స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ సింగిల్ స్క్రీన్, 7.9 ఇంచ్ డ్యూయల్ స్క్రీన్ మరియు పూర్తిగా మడత విప్పితే 10.2 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది OLED స్క్రీన్ తో వస్తుంది మరియు ఈ స్క్రీన్ LTPO అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 10.2 ఇంచ్ మరియు 3K రిజల్యూషన్ ఈ ఫోన్ లో యూనిక్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా మరియు చాలా స్లీక్ గా కూడా వుంది.
ఈ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ పూర్తిగా మడత విప్పినప్పుడు సన్నని ట్యాబ్ లెట్ మాదిరిగా కనిపిస్తుంది. అయితే, ఈ ఫోన్ ని మడత పెట్టగానే సుందరమైన ఫోన్ గా మారిపోతుంది. ఈ ఫోన్ ను హువావే టెర్మినల్ హాంగ్ మెంగ్ స్మార్ట్ డివైజ్ ఆపరేటింగ్ సిస్టం సాఫ్ట్ వేర్ వెర్షన్ 4.0 తో పని చేస్తుంది మరియు AI సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ హువావే మేట్ ఎక్స్ ఫోన్ ను 16GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ చేసింది.
ఈ ఫోన్ లో 50MP అల్ట్రా వైడ్, 12MP అల్ట్రా వైడ్ 12MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సిస్టం తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కెమెరాతో సిస్టం OIS + EIS సపోర్ట్ లతో వస్తుంది మరియు 4K Video రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో video HDR Vivid, 4D ప్రెడెక్టివ్ ఫోకస్ ట్రాకింగ్ మరియు 10 లెవల్స్ అడ్జస్టబుల్ ఫిజికల్ అపర్చర్ వంటి చాలా ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ SBC, AAC, LDAC సపోర్ట్ మరియు L2HC హై డెఫినేషన్ ఆడియో సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ను 5600 mAh బ్యాటరీని 50W హువావే వైర్లెస్ ఛార్జ్ మరియు 7.5W వైర్లెస్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
Also Read: కొత్త హోమ్ థియేటర్ స్పీకర్ సిస్టం లాంచ్ చేసిన Sony: ప్రైస్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
HUAWEI Mate XT : ప్రైస్ (చైనా)
హువావే ఈ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ ను మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ ధర వివరాలు క్రింద చూడవచ్చు.
హువావే మేట్ XT (16GB + 128GB) వేరియంట్ ధర (చైనా): ¥ 19999 (సుమారు రూ. 2,36,000)
హువావే మేట్ XT (16GB + 512GB) వేరియంట్ ధర (చైనా): ¥ 21999 (సుమారు రూ. 2,60,000)
హువావే మేట్ XT (16GB + 1TB) వేరియంట్ ధర (చైనా): ¥ 23999 (సుమారు రూ. 2,84,000)