Huawei Mate 20 Pro ట్రిపుల్ కెమేరా, కిరిణ్ 980 SoC మరియు వైర్లెస్ రివర్స్ ఛార్జింగుతో విడుదల

Huawei Mate 20 Pro ట్రిపుల్ కెమేరా, కిరిణ్ 980 SoC మరియు వైర్లెస్ రివర్స్ ఛార్జింగుతో విడుదల
HIGHLIGHTS

ఈ హువావే మేట్ 20 ప్రో ఇండియాలో రూ . 69,990 ధరతో విడుదలయ్యింది.

ఈరోజు హువావే, తన ప్రమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ అయినటువంటి " Huawei Mate 20 Pro" ని ఇండియాలో విడుదల చేసింది.  7nm చిప్ మరియు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కలిగిన మొదటి ఫోనుగా, ఈ ఫోన్ రెండు గొప్ప ఫిచర్లను తీసుకువస్తుంది. అలాగే, ఈ ఫోన్ Leica వైడ్ యాంగిల్  లెన్సుతో డ్యూయల్ – NPU Leica ట్రిపుల్ కెమేరా మరియు 40 W  హై స్పీడ్ ఛార్జింగ్ చేయగల హువావే యొక్క సూపర్ ఛార్జ్ టెక్నాలజీతో వస్తుంది.

Huawei Mate 20 Pro ప్రత్యేకతలు

ఈ హువావే మేట్ 20 ప్రో,19.5 :9 ఆస్పెక్ట్ రేషియోతో ఒక 6.39 అంగుళాల 2K+ కర్వ్డ్ OLED HDR డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లేలో ప్రస్తుతం అన్ని ఫోన్లలో వస్తున్నట్లుగానే, ఒక 'నోచ్' టి ఉంటుంది మరియు ఈ నోచ్ లోపల డాట్ ప్రొజక్టర్, ఫ్లూడ్ ఇల్యూమినేటర్, IR కెమేరా ప్రాక్సిమిటీ మరియు ఒక పరిసర కాంతి సెన్సార్ ని కలిగి ఉంటుంది. ఇవ్వనికూడా కలిసి ఒక  ఫేస్ అన్లాక్ వలనే పనిచేస్తాయి మరియు ఒక 3D పేస్ అన్లాక్ వలనే కూడా పనిచేస్తాయి. అలాగే, ఈ ఫోన్ ఈ 3D పద్దతిని ఉపయోగించి ఆహార పదార్ధాలలో కేలరీలను మరియు దాని యొక్క బరువును కూడా లెక్కిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్, కిరిణ్ 980 SoC శక్తితో వస్తుంది. ఈ Soc కూడా కోర్టెక్స్ -A76ఆధారితమైన 7nm నిర్మాణంతో ఉంటుంది మరియు ఈ CPU మాలీ-G76 తో డ్యూయల్ -NPU తో ఉంటుంది. ఈ పరికరం, ఆండ్రాయిడ్ 9 పై ఆధారితమైన EMUI 9 తో నడుస్తుంది మరియు ఈ సరికొత్త OS  సింపుల్ సెట్టింగులు వంటి కొత్త లక్షణాలను తీసుకువస్తుంది. ఈ ఫోన్ ఒక 4200mAh బ్యాటరీ కలిగి,  40 W  హై స్పీడ్ ఛార్జింగ్ చేయగల హువావే యొక్క సూపర్ ఛార్జ్ టెక్నాలజీతో వస్తుంది మరియు ఇది కేవలం 30 నిముషాల చార్జింగుతో 70 % వరకు బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇక ఆప్టిక్సా విషయానికి వస్తే, ఈ హువావే మేట్ 20 ప్రో 40MP +20MP+ 8MP సెన్సర్లు కలిగిన ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. ఈ సెన్సర్లను ఒక చదరపు ఆకారంలో పొందుపరిచారు. ఈ 40MP సెన్సార్ f/1.8 ఆపేర్చేర్ తో 27nm వైడ్ లెన్స్ తో కలిసివుంటుంది, అయితే ఈ 12MP సెన్సార్ ఒక f /2.2 ఆపేర్చేరుతో 16nm అల్ట్రా వైడ్ లెన్స్ తో కలిసివుంటుంది. ఇక మూడవ,8MP సెన్సార్ 3X80mm టెలిఫోటో లెన్స్ ఒక f/2.2 ఆపేర్చేరుతో వస్తుంది. ఈ ఫోను యొక్క కెమేరాలు ఆర్టిఫిషల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (AIS) కి సపోర్టుచేస్తాయి. ఈ కెమేరాతో, 3X ఆప్టికల్ జూమ్, 135mm తో 5X హైబ్రిడ్ జూమ్ మరియు 270mm తో 10X డిజిటల్ జూమ్ వరకు చేసుకోవచ్చు.

హువావే మేట్ 20 ప్రో ధర మరియు ఆఫర్లు          

ఇది ఎమిరాల్డ్ గ్రీన్ మరియు ట్వైలైట్ రంగులతో లభిస్తుంది మరియు ఇది 6GB ర్యామ్ మరియు 128GB అంతర్గత మెమొరీ జతగా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యోక్క ధరను ఇండియాలో రూ. 69,990 గా నిర్ణయించారు మరియు ఇది డిసెంబరు 4 నుండి అమ్మకాలను అమేజాన్ ప్రత్యేకంగా అమ్మకాలను కొనసాగిస్తుంది మరియు ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 3 నుండే యాక్సెస్ దొరుకుతుంది. అలాగే, డిసెంబర్ 10 నుండి మెట్రో సిటీలలోని, అధీకృత క్రోమా రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.  

ఈ ఫోనుతో, కంపెనీ Sennheiser PXC 550 హెడ్ ఫోన్ జతగాకలిపి రూ. 71,990 ధరకి అందిస్తోంది. వోడాఫోన్ ఐడియా పోస్టుపెయిడ్ వినియగాధారులు, RED/Nirvana పాక్స్  రూ . 499 మరియు అంతకంటే ఎక్కువ ధర కలిగిన ప్రణాళికలకు, 20 శాతం డిస్కౌంట్ పొందుతారు. ఇంకా, ఎవరైతే వోడాఫోన్ మరియు ఐడియా యొక్క రూ.199 విలువైన రిజార్జి చేస్తారో వారు, 12 నెలలు/రీఛార్జిల వరకూ రోజువారీ 1.1 GB అదనపు డేటాని పొందుతారు.                     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo