స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, వాచ్ మరియు టాక్ బాండ్ ను లాంచ్ చేసిన Huawei
వరసుగా నాలుగు డివైజ్ లను లాంచ్ చేసిన Huawei చైనా కంపెని
చైనిస్ స్మార్ట్ ఫోన్ కంపెని, Huawei ఎసేండ్ సిరిస్ లో మొదటి ఫోన్, Huawei ఎసేండ్ P8 పేరుతొ ఆండ్రాయిడ్ ఫోన్ ను లాంచ్ చేసింది. Huawei సొంత ప్రాసెసర్ కిరిన్ 930 ఆక్టో కోర్ 2.0 GHz ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ Huawei హానర్ 6 ప్లస్ లో ఉన్న కిరిన్ 920 కి అపగ్రేడేడ్.
ఎసేండ్ P8 స్పెసిఫికేషన్స్ – 5.2 అంగుళాల 1080P డిస్ప్లే, 3జిబి ర్యామ్, 16/64జిబి స్టోరేజ్, 128 అదనపు స్టోరేజి, ఆండ్రాయిడ్ లాలిపాప్, Huawei కి దాని కష్టమైజడ్ ఓస్, ఎమోషన్ UI ప్రధాన ఆకర్షణ. 13MP కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా మరియు 2680 mah బ్యాటరీ.
దీనితో పాటు Huawei ఎసేండ్ P8 లైట్ బడ్జెట్ ఫోన్, ఎసేండ్ P8 మ్యాక్స్, 6.8 in టాబ్లెట్ ఫోన్ (ఫెబ్లేట్) ను లాంచ్ చేసింది. P8 లైట్ 1.2 GHz క్వాడ్ కోర్ కిరిన్ 620 SoC, 2జిబి ర్యామ్ మరియు P8 మ్యాక్స్ 2.3 GHz కిరిన్ 935 ప్రాసెసర్, 3జిబి ర్యామ్ స్పెక్స్ తో వస్తున్నాయి. అయితే రెండింటిలో 13MP బ్యాక్ కెమేరా మరియు ఆండ్రాయిడ్ లాలిపాప్ ఉన్నాయి.
కాని ఇండియాలో ఎసేండ్ ఫోనులన్ని Monicker బ్రాండ్ పేరు మీద అమ్మకాలు జరుగుతాయి. ఎసేండ్ P8 హై ఎండ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ కింద సెల్ అవనుంది. దిని ధర అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు, కాని అంచనా ప్రకారం సుమారు 30,000 రూ. ఉండవచ్చు. వీటితో పాటు ఎసేండ్ మీడియా ప్యాడ్ x2 టాబ్లెట్ మరియు రెండు వేరబల్స్ లాంచ్ చేసింది. వేరబల్స్ లో ఒకటి టాక్ బాండ్ B2 మరొకటి Huawei వాచ్ W1. Huawei లాంచ్ చేసిన మొత్తం ఈ డివైజ్ లు అన్నీ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి.