హానర్ మొబైల్స్ కంపెని Huawei నుండి కొత్తగా Y సిరిస్ ఫోనులు అనౌన్స్
హానర్ మోడల్స్ ను అందించే కంపెని, Huawei నుండి రెండు కొత్త Y సిరిస్ ఫోనులు విడుదల అయ్యాయి. ఒకటి Y2II మరొకటి Y5 II. రెండూ కంపెని అఫిషియల్ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యాయి.
వీటి ప్రైసెస్ మరియు రిలీజ్ డేట్స్ ఇంకా వెల్లడికాలేదు. లుక్స్ వైజ్ గా డిఫరెంట్ కలర్స్ ఆప్షన్స్ లో వస్తున్నాయి కాని స్పెక్స్ మాత్రం low ఎండ్ లోనే ఉన్నాయి. అంటే ఇవి బడ్జెట్ సెగ్మెంట్ లో విడుదల కానున్నాయి అని అనిపిస్తుంది.
రెండూ రెండు వేరియంట్స్ లో లాంచ్ కానున్నాయి. ఒకటి 3G వేరియంట్ Y3II లో 1GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6582M ప్రొసెసర్, 4G వేరియంట్ లో 1GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6735M SoC.
3G వేరియంట్ Y5II లో `1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT 6582SoC ఉండగా, 4G వేరియంట్ Y5II లో 1.3GHz మీడియా టెక్ క్వాడ్ కోర్ MT6735P SoC ఉంటుంది.
మిగిలిన స్పెక్స్ అన్నీ రెండు వేరియంట్స్(మోడల్స్ కాదు) లో సేమ్. రెండింటిలో కామన్ గా ఆండ్రాయిడ్ 5.1 os, 1GB ర్యామ్, 8GB ఇంటర్నెల్ స్టోరేజ్ అండ్ sd కార్డ్ సపోర్ట్ ఉన్నాయి.
ఇక రెండు మోడల్స్ లో డిఫరెంట్ గా ఉన్న స్పెక్స్ విషయానికి వస్తే..
Y3 II లో 4.5 in 480×854 పిక్సెల్స్ డిస్ప్లే, 5MP రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 2100 mah బ్యాటరీ తో ఇది 150 గ్రా బరువు ఉంది.
Y5 II లో 5 in HD డిస్ప్లే, 8MP రేర్ కెమరా with డ్యూయల్ LED ఫ్లాష్ అండ్ 2MP ఫ్రంట్ కెమేరా with సింగిల్ LED ఫ్లాష్, 2200 mah బ్యాటరీ తో 135 గ్రా బరువు కలిగి ఉంది.