Huawei సబ్ బ్రాండింగ్ హానర్ నుండి మరొక ఫోన్ లాంచ్ అయ్యింది నిన్న. దీని పేరు Honor 7i. మూడు వేరియంట్ ప్రైసేస్ లో చైనా లోని రిటేల్ స్టోర్స్ లో 16,397 రూ , 17,422 రూ, 19,473 రూ లకు available గా ఉంది.
ఫోన్ లో హై లైట్స్…
1. దీనికి రోటేటబుల్ కెమరా ఉంది. కెమెరాను బయటకు పుష్ చేసి ఫ్రంట్ కెమేరా లా కూడా వాడుకోగలరు. 180 డిగ్రి లో ఏ యాంగిల్ లో అయిన ఫోటో తీసుకోవచ్చు. ఆటో exposure, ఆటోమేటిక్ ఫేస్ రికాగ్నిషణ్, ఆటో స్మైల్ షట్టర్, ఆటో వైట్ బ్యాలన్స్, SLR గ్రేడ్ iSP (Low లైట్ లోని ఫోటోలు అద్భుతంగా తీస్తుంది.)
2. ఫోన్ సైడ్ భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లేస్ చేసింది. హానర్ 7i మోడల్ ఇండియన్ మార్కెట్ లోకి కూడా వస్తుంది అనే అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇతర దేశాల మార్కెట్ గురించి ఇంకా కంపెని వెల్లడించలేదు.
హానర్ 7i స్పెసిఫికేషన్స్ – 5.2 in FHD LCD నెగటివ్ డిస్ప్లే, 64బిట్ ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 616 SoC, 3gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 3100 mah బ్యాటరీ, 13MP కెమేరా( సింగిల్ కెమేరా both సైడ్స్ ), ఫింగర్ ప్రింట్ సెన్సార్.
హానర్ mate 7S మోడల్ ను కూడా బెర్లిన్ లో రిలీజ్ చేస్తుంది huawei అని రూమర్స్ ఉన్నాయి. దీనిలో ఆపిల్ ప్రవేసపెట్టిన force Touch టెక్నాలజీ ఉంది అని ఆశిస్తున్నారు అందరూ.