HTC U24 Pro: మూడు 50MP కెమెరాలు మరియు కొత్త డిజైన్ తో వచ్చింది.!
HTC బ్రాండ్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అడుగుపెట్టింది
HTC U24 Pro కొత్త డిజైన్ తో మార్కెట్ లో అడుగు పెట్టింది
HTC U24 Pro స్మార్ట్ ఫోన్ మూడు 50 MP కెమెరాలు కలిగి వుంది
HTC U24 Pro: HTC బ్రాండ్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అడుగుపెట్టింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను యురేపియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో ప్రస్తుతం నడుస్తున్న లేటెస్ట్ ట్రెండీ ఫీచర్స్, మూడు 50MP కెమెరాలు మరియు కొత్త డిజైన్ తో తైవాన్ మార్కెట్ లో అడుగు పెట్టింది. గత సంవత్సరం తీసుకొచ్చిన HTC U23 Pro స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ జనరేషన్ ఫోనుగా ఈ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది.
HTC U24 Pro: ఫీచర్లు
HTC బ్రాండ్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను 6.8 ఇంచ్ బిగ్ కర్వ్డ్ OLED డిస్ప్లే అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఈ ఫోన్ ను Qualcomm యొక్క లేటెస్ట్ బడ్జెట్ చిప్ సెట్ Snapdragon 7 Gen 3 తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ లో 12GB LPDDR5 ర్యామ్ మరియు 256GB (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 OS పై రన్ అవుతుంది.
Also Read: అమెజాన్ సైట్ లో దర్శనమిచ్చిన JioEV Aries ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్.!
ఇక ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50 MP (OIS) + 8 MP అల్ట్రా వైడ్ + 50 MP (2x ఆప్టికల్ జూమ్) కెమెరా లను కలిగి వుంది. ఈ ఫోన్ కెమెరాలో Pro Mode, టైం ల్యాప్స్, AI సీన్ డిటెక్షన్ వంటి గుట్టల కొద్దీ ఫీచర్స్ తో పాటు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ను కలిగి వుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరాను ఆటో ఫోకర్ మరియు ఆటో HDR వంటి మరిన్ని ఫీచర్ లతో కలిగి వుంది.
ఇక కొత్త ఫోన్ NFC, బ్లూటూత్ 5.3, 3.5mm జాక్ మరియు USB 3.0 టైప్ C పోర్ట్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో 4,600 mAh బ్యాటరీ వుంది మరియు ఇది 60 W వైర్డ్ ఛార్జింగ్, 15 W వైర్లెస్ ఛార్జింగ్, 5 W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ IP67 రేటింగ్ తో స్ప్లాష్ మరియు డస్ట్ ప్రూఫ్ గా ఉంటుంది.
HTC U24 Pro: ధర
HTC ఈ ఫోన్ ను యూరప్ మార్కెట్ లో €564 (సుమారు రూ. 51,000 రూపాయలు) ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ ఇతర మార్కెట్ లాంచ్ లేదా అందుబాటు గురించి కంపెనీ ఎటువంటి ప్రకటనా చేయలేదు.