HTC U12 ప్లస్ లాంచ్ కి ముందు లీక్ , సన్నని బెజెల్ మరియు డ్యూయల్ కెమెరాలు అమర్చారు…..
HTC తన రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ HTC U12 ప్లస్ ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది,మరియు ఈ ఫోన్ యొక్క లాంచ్ కి ముందే స్పెక్స్ బహిర్గతమయ్యాయి . ఇవాన్ బ్లూస్ ఒక ఫోన్ ఇమేజ్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి దానిని HTC U12 ప్లస్ అని పెట్టారు.
మీరు ఈ ఫోన్ గురించి వెల్లడైన వార్తల గురించి మాట్లాడినట్లయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ఒక సన్నని బెజెల్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇదే కాకుండా, ఈ ఫోన్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో ఉంది. ఈ U12 ప్లస్ ఫోన్ డిజైన్ దాని పూర్వపు ఫోన్స్ కు సమానంగా ఉంటుందని కూడా చెప్పబడుతోంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది.
U12 ప్లస్ గురించి మార్చిలో వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ U12 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల LCD డిస్ప్లేను WQHD + రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ 6GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 3,420 mAh బ్యాటరీ తో రావచ్చు. ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ డ్యూయల్ వెనుక కెమెరా, ఈ ఫోన్ 12 మెగాపిక్సెల్స్ మరియు 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా తో వస్తాయి అని పుకారు.