HTC U11 Plus బెజెల్ లెస్ డిసైన్ అండ్ 18:9 డిస్ప్లే తో 11 నవంబర్ న లాంచ్.
HTC U11 ప్లస్ స్మార్ట్ఫోన్ ని కంపెనీ నవంబర్ 11 న ప్రారంభించనుంది. ఫ్రెంచ్ వెబ్సైట్ ప్రకారం, తైవానీస్ స్మార్ట్ఫోన్ మేకర్ ఓషన్ మాస్టర్ కొడ్నేమ్ యొక్క ఫ్లాగ్షిప్ డివైస్ ఫై పనిచేస్తుంది. మరో Android One కొడ్నేమ్ డివైస్ HTC U11 లైఫ్ ఫై పనిచేస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి.
హెచ్టీసీ యుఎస్ 11 ప్లస్లో 2880 x 1440 పిక్సెల్స్ రిజుల్యూషన్ అందించే 5.99 అంగుళాల క్వాడ్ HD + డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే ద్వారా జపాన్ డిస్ప్లే మరియు 18: 9 యొక్క యాస్పెక్ట్ రేషియో ని అందిస్తుందని చెప్పబడుతోంది.
U11 Plus స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 చిప్సెట్ తో వస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ 4GB లేదా 6GB RAM అండ్ 64GB లేదా 128GB యొక్క UFS 2.1 స్టోరేజ్ తో వస్తుంది . ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ కలదు . గత ఫ్లాగ్షిప్ U11 లానే HTC U11 Plus లో 12MP రేర్ షూటర్ అందుబాటులో వుంది . ఇక ఫ్రంట్ సైడ్ 8MP ఇమేజ్ సెన్సార్ కలదు .
U11 Plus స్మార్ట్ ఫోన్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సెర్టిఫికెట్ తో వస్తుంది . ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 8.0 ఒరియో అప్డేట్ తో రానుంది . కంపెనీ U11, U Ultra మరియు గత ఏడాది లో వచ్చిన HTC 10 కోసం ఆండ్రాయిడ్ ఒరియో అప్డేట్ రానున్నట్లు ధృవీకరించింది . ఈ ఫోన్ క్వాల్ కామ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది , మరియు మొదట చైనా లోనే అందుబాటులో వస్తుంది .