HTC One X10 స్మార్ట్ ఫోన్ 4000mAh బ్యాటరీ తో ఎంట్రీ
HTC One X10 గురించి ఇప్పటివరకు అనేక లీక్స్ వెలుగులోకి వచ్చాయి . ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ అధికారకంగా ప్రవేశపెట్టబడింది . ఇప్పుడు ఈ డివైస్ రసియా మార్కెట్ లో లాంచ్ చేయబడింది . మొదట్లో ఈ ఫోన్ ధర $335 అంటే సుమారు Rs 22,000
త్వరలో భారత మార్కెట్లో సహా ఇతర మార్కెట్లలో కూడా ప్రారంభించటానికి భావిస్తున్నారు
దీనిలో 5.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఇవ్వబడింది . ఈ డివైస్ లో 3GB RAM తో పాటుగా 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది . ఈ డివైస్ లో 2.2 GHz MediaTek 6755 Helio P10 చిప్సెట్ ఇవ్వబడింది .
ఇక కెమెరా చూస్తే 16 MP మరియు ఫ్రంట్ కెమెరా 8 MP . ఈ డివైస్ లో బాటరీ 4000mAh ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది .దీని బ్యాటరీ 26 గంటల టాక్ టైం మరియు మరియు 31 రోజుల స్టాండ్బై టైం ఇస్తుంది.
కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 4.2, Wi-Fi 802.11 a/b/g /n (2.4 and 5GHz), DLNA, GPS, GLONASS మరియు డ్యూయల్ నానో సిమ్ కనెక్టివిటీ ఇవ్వబడింది.