HTC వన్ Me లాంచ్
20MP కెమేరా, 2TB కార్డ్ స్లాట్ దీని హై లైట్స్
HTC తాజాగా ఒక డ్యూయల్ సిమ్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది HTC రెగ్యులర్ ట్రేడ్మార్క్ డిజైన్ తో వస్తుంది. అయితే ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ వైపు చూడండి..
2.2GHz మీడియా టెక్ Helio X10 ఆక్టో కోర్ ప్రొసెసర్ మరియు 3 జిబి ర్యామ్ కాన్ఫిగ్ తో వస్తుంది. ఫోన్ మెటాలిక్ ఫినిషింగ్ తో పోలి కార్బనైట్ బాడి తో తయారు చేయబడింది. డ్యూయల్ స్పీకర్ గ్రిల్స్ ఫోన్ లో ఫ్రంట్ సైడ్ బాటమ్ ఏరియా లో ప్లేస్ చేయబడ్డాయి. దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీనిలో Dolby ఆడియో బూమ్ సౌండ్ టెక్నాలజీ కూడా జోడించారు.
20MP కెమేరా, f/2.2 అపెర్చర్ లెన్స్ 4K వీడియోలను సైతం రికార్డ్ చేస్తుంది. 4MP అల్ట్రా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా 1080P వీడియోలను 30 ఫ్రేమ్స్ పర్ సెకెండ్ కు రికార్డ్ చేయగలదు. దీనికి 5.2 in WQHD 1440 x 2560 పిక్సెల్స్ రిసల్యుషణ్ డిస్ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 5.0.2 బాక్స్ నుండి వస్తుంది. 32 జిబి ఇంటర్నెల్ స్టోరేజ్, 2TB (2000 GB) అదనపు స్టోరేజ్ సపోర్ట్. HTC సెన్స్ 7 UI వస్తున్న దీనికి 2840 mah బ్యాటరీ ఉంది.
క్లాసిక్ గోల్డ్ మరియు Meteor గ్రే కలర్స్ లో ఈ నెల చివరికల్లా సేల్ అవనుంది HTC One mE . దీని ధర, 40,500 రూ. తాజాగా htc one సిరిస్ లో M9+ మరియు E9+ మోడల్స్ ను లాంచ్ చేసింది.