HTC డిజైర్ 326 డ్యూయల్ సిమ్ ను ఇండియాలో లాంచ్ చేసింది. 9,590 రూ లకు ఈరోజు నుండి ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుంది. HTC Myntra అప్లికేషన్ లో 5000 రూ షాపింగ్ డిస్కౌంట్ మరియు హంగామా ఆప్ 3 నెలలు ఉచిత ఏక్సిస్ ఆఫర్స్ ను ఇస్తుంది. దీనితో పాటు HTC వన్ E9+ డ్యూయల్ సిమ్ మోడల్ 36,790 రూ లకు లాంచ్ చేసింది.
HTC 326 మోడల్ డిజైర్ 526+ సిరిస్ అప్ గ్రేడ్ మోడల్. దీని స్పెసిఫికేషన్స్- 4.5 in (480×854) డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ మరియు 1 జిబి ర్యామ్, 8జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 32జిబి అదనపు స్టోరేజ్ సపోర్ట్, 8MP ఆటో ఫోకస్ BSI సెన్సార్ బ్యాక్ కెమేరా, 1080P వీడియో రికార్డింగ్, 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా, 720P వీడియో రికార్డింగ్, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 4.0, వైఫై, 3.5 mm ఆడియో జ్యాక్, usb 2.0 5 పిన్ పోర్ట్, 2000 mah బ్యాటరీ. దీని ధర 9.590రూ.
HTC వన్ E9+ డ్యూయల్ సిమ్, 5.5 in WQHD(1440×2560) డిస్ప్లే, ఆక్టో కోర్ ప్రాసెసర్, 3జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నెల్ మెమరి, 128 జిబి అదనపు స్టోరేజ్ సపోర్ట్, 20MP ఆటో ఫోకస్, BSI సెన్సార్, f/2.2, 27.8mm లెన్స్, 4K మరియు 13MP ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ కెమేరా, NFC, బ్లూటూత్ 4.1, వైఫై, 3.5mm స్టీరియో ఆడియో జ్యాక్, మైక్రో usb 2.0 పోర్ట్, 2800mah బ్యాటరీ. దీని ధర 36,790 రూ.
"HTC డిజైర్ 326 డైలీ యూసేజ్ కోసం స్టైలిష్ డిజైన్ తో తయారు చేసాము, పోలి కర్బనేట్ మేటేరియాల్ తో స్ట్రాంగ్ బిల్డ్ బాడీ ఉన్న 326 చేతిలో ఫిట్ అయ్యే విధంగా డిజైన్ చేయబడింది." అని HTC ప్రెసిడెంట్, ఫైజల్ అన్నారు.
"పాపులర్ అల్ట్రా పిక్సెల్ ను ఫ్రంట్ కెమేరా లో జోడించి, మీడియా టెక్ హిలియో x10 ప్రాసెసర్ మరియు 8*2 GHz ఆక్టో కోర్ చిప్సెట్ తో E సిరిస్ లోనే వన్ E9+ ను పవర్ఫుల్ డివైజ్ గా రుపొందించం" అని అన్నారు ఫైజల్.