HTC నుంచి సరికొత్తగా u సిరీస్ యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ని నవంబర్ 2 న లాంచ్ అవ్వబోతుంది . ఈ డివైస్ బెజిలెస్ డిజైన్ అండ్ ఇంప్రూవ్డ్ హార్డ్ వేర్ తో వస్తుంది .
రూమర్స్ ప్రకారం , HTC U11 Plus లో 6 ఇంచెస్ క్వాడ్ HD+ POLED ఉండి18:9 యాస్పెక్ట్ రేషియో ని కలిగి వుంది .ఈ హ్యాండ్ సెట్ ని GFXBench లో లిస్ట్ చేయబడింది . 2880 x 1440 పిక్సల్స్ రిజల్యూషన్ అండ్ ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 835 మొబైల్ చిప్సెట్ తో వస్తుంది . ఈ డివైస్ లో 4GB RAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 8.0 ఒరియో పై నడుస్తుంది .
Source: Couponraja
మరియు ఈ డివైస్ లో 12 MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా కలవు. ఈ ఫోన్ లో డైమెన్షన్స్ 158.2 mm x 74.6 mm x 9.1mm గా ఉన్నాయని సమాచారం . ఈ హ్యాండ్ సెట్ ఒకే వెనుక కెమెరా సెటప్ తో వస్తుంది, ఇది 4000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ మరియు ఎడ్జ్ సెన్స్ ఫీచర్ తో వస్తుంది అని భావిస్తున్నారు.