3 నెలలు పాటు unlimited 4G ఇంటర్నెట్ అందించటం వలన ఇండియాలో అందరూ రిలయన్స్ Jio సిమ్ ను ఎలాగైనా సంపాదించాలని ప్రయత్నాలలో పడ్డారు.
అయితే ఒకప్పుడు అలా జరిగేది కాని ఇప్పుడు కంపెని strict గా కేవలం సామ్సంగ్ selected ఫోన్స్ మరియు LYF ఫోనుల పైనే ఈ ఆఫర్/sim ను ఇస్తుంది అని ఆల్రెడీ మొన్న వ్రాసిన ఆర్టికల్ లో తెలపటం జరిగింది.
Jio పై టోటల్ మీరు తెలుసుకోవలసిన ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో వ్రాయటం జరిగింది. ఇప్పుడు ఈ సిమ్ ను మరొక విధంగా కూడా పొందేలా అవకాశం ఉంది. అయితే ఇది కూడా మరీ అంత సులభంగా లేదు, దానికి తోడూ డబ్బులు కూడా పెట్టవలసి వస్తుంది.
JioFi 2 పేరుతో hotspot డివైజ్ సేల్స్ అవుతున్నాయి. మీరు HP కంపెని ప్రోడక్ట్ ఏమైనా కొని ఉంటే, HP నుండి మీకు ఒక మెసేజ్ వస్తుంది Jio కోడ్ తో. ఇది ఎవరికీ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము.
ఇప్పుడు ఆ కోడ్ ను రిలయన్స్ స్టోర్స్ కు తీసుకువెళ్ళి సుమారు 2,800 రూ ఉన్న హాట్ స్పాట్ డివైజ్ కొంటే, దానితో పాటు Jio సిమ్ వస్తుంది. సో ఇక ఈ సిమ్ పై కూడా 3 months unlimited ఆఫర్ వేసుకోగలరు. సో బేసిక్ గా hotspot డివైజ్ రిలయన్స్ కంపెని దే, కేవలం కోడ్స్ మాత్రమే ఇస్తుంది HP.
అయితే ఇది hotspot డివైజ్ కొందామనే ప్లాన్స్ లో ఉన్నవారికే సమంజసం. కేవలం 3 నెలల ఆఫర్ కోసం ఇంత హడావుడి, ఖర్చు అనవసరం. HP ప్రోడక్ట్ ఏమైనా వాడుతుంటే మరియు hotspot తీసుకునే ఆలోచనలో ఉంటె, HP కేర్ ను కేనేక్ట్ చేసి తెలుసుకోగలరు కోడ్ కొరకు.