Honor X9b: హానర్ ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ గురించి ప్రస్తావన తీసుకు వచ్చింది. చాలా కాలం ఫోన్ లను భారత మార్కెట్ లో లాంచ్ చేయకుండా సైలెంట్ గా ఉన్న హానర్, ఇప్పుడు గొప్ప ఫోన్లను విడుదల చేస్తోంది. రీసెంట్ గా ఇండియాలో గొప్ప కెమేరా మరియు గొప్ప డిస్ప్లేతో హానర్ 90 5జి స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 15వ తేది భారత మార్కెట్ లో హానర్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ ఫోన్ ఇప్పటికే చైనాతో సహా పలు దేశాల్లో ఇప్పటికే లాంచ్ అయ్యి సేల్ కూడా అవుతోంది. ఈ ఫోన్ ఇప్పటికే మలేషియా, సింగపూర్, చైనా వంటి ఆసియా పసిఫిక్ దేశాలతో పాటుగా యూరప్ దేశాలలో కూడా లభిస్తోంది. ఈ ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా విడుదలకు సిద్దమయ్యింది. ఈ ఫోన్ ను అత్యంత కఠినమైన డ్రాప్ పరిస్థితులను కూడా తట్టుకునేలా తయారు చేసినట్టు హానర్ తెలిపింది.
ఇండియాలో హానర్ ఎక్స్6బి స్మార్ట్ ఫోన్ గురించి హానర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ గట్టితనాన్ని తెలిపేలా ఈ పోస్ట్ ను చేసింది. ఈ పోస్ట్ లో స్మార్ట్ ఫోన్ డిస్ప్లే పైన ఉపయోగించే Tempered Glass కాలం చెల్లిపోతుందని చెబుతోంది.
Also Read : NoiseFit Vortex Plus: తక్కువ ధరకే AMOLED స్మార్ట్ వాచ్ లాంచ్ చేస్తున్న నోయిస్.!
అయితే, ఈ ఫోన్ గట్టితనాన్ని వివరిస్తూ హానర్ సౌత్ ఆఫ్రికా అకౌంట్ నుండి చేసిన టీజింగ్ ట్వీట్ మరింత స్పష్టత ఇస్తుంది. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
హానర్ ఎక్స్6బి స్మార్ట్ ఫోన్ సింగపూర్ వేరియంట్ 6.78 ఇంచ్ 360° Anti-Drop Protection కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 100% DCI-P3 వైడ్ కలర్ గాముట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి వుంది. ఈ ఫోన్ క్రింద పడినా కూడా డిస్ప్లేలో చిన్న స్క్రాచ్ కూడా రాదని కంపెనీ తెలిపింది. ఈ హానర్ ఫోన్ Snapdragon 6 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక 108MP మెయిన్ సెన్సార్ + 5MP అల్ట్రా వైడ్/డెప్త్ సెన్సార్ + 2MP మ్యాక్రో సెన్సార్ లు కలిగిన కెమేరా సెటప్ తో వస్తుంది. ఇది 8X డిజిటల్ జూమ్ మరియు 4K video రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 5800mAh బిగ్ బ్యాటరీని 35W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.