HONOR X9b 5G: భారీ ఫీచర్స్ మరియు ఆఫర్లతో వచ్చింది|Tech News

Updated on 16-Feb-2024
HIGHLIGHTS

హానర్ ఎక్స్9బి 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యింది

కొత్త Ultra-Bounce Anti-Drop డిస్ప్లే తో వచ్చిన హానర్ ఎక్స్9బి

ఈ ఫోన్ పైన ఈరోజు రూ. 5,000 రూపాయల అదనపు తగ్గింపు ఆఫర్ లభిస్తోంది

HONOR X9b 5G: గ్లోబల్ మార్కెట్ లో విడుదలై మంచి అమ్మకాలను సాధించిన హానర్ ఎక్స్9బి 5జి స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా విడుదలయ్యింది. క్రింద జారిపడినా కూడా డిస్ప్లే మరియు ఫోన్ కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండే కొత్త Ultra-Bounce Anti-Drop డిస్ప్లే తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ హానర్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర,స్ స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

HONOR X9b 5G Price & Offers

హానర్ ఎక్స్9బి స్మార్ట్ ఫోన్ (8GB RAM + 256GB) రూ. 25,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంఛ్ అయ్యింది. ఈ ఫోన్ లాంఛ్ సందర్భంగా ప్రత్యేకమైన లాంఛ్ ఆఫర్లను కూడా హానర్ ప్రకటించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ లేదా ఎక్స్ చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 3,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదే, ఫిబ్రవరి 16 వ తేదీ మొదటి రోజు ఎక్స్ చేంజ్ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు ఏకంగా రూ. 5,000 రూపాయల అదనపు తగ్గింపు లభిస్తుంది.

ఇది కాకుండా రూ. 699 రూపాయల విలువైన ఉచిత ఛార్జర్ మరియు రూ. 2,999 రూపాయల విలువైన హానర్ ప్రొటెక్ట్ ప్లాన్ ను కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అఫర్ లతో ఈ ఫోన్ ను అమేజాన్ నుండి కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

Also Read : HONOR 90 Discount: హానర్ పవర్ ఫుల్ ఫోన్ పైన భారీ తగ్గింపు.!

హానర్ ఎక్స్9బి 5జి ఫీచర్లు

హానర్ ఎక్స్9బి 5జి స్మార్ట్ ఫోన్ Ultra-Bounce Anti-Drop 6.78 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వచ్చిన మొదటి ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ 360 డిగ్రీల యాంటీ డ్రాప్ ప్రొటెక్షన్ టెక్ తో క్రింద పడినా కూడా ఎటువంటి నష్టం జరగకుండా తట్టుకొని నిలుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 6 Gen 1 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB RAM + 8GB ర్యామ్ టర్బో మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ హానర్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 108MP వైడ్ + 5MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ కెమేరాతో 4K photo and video recording పొందవచ్చని హానర్ తెలిపింది. ఈ ఫోన్ లో 5800mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వుంది. ఈ హానర్ ఫోన్ Android 13 OS పైన MagicOS 7.2 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :