HONOR X9b 5G ఫోన్ పైన అందించిన భారీ ఆఫర్లు మిస్సవకండి.!

Updated on 21-Feb-2024

HONOR X9b 5G స్మార్ట్ ఫోన్ తో కంపెనీ ఇండియన్ మార్కెట్ లోని బడ్జెట్ సెగ్మెంట్ లో మళ్ళీ పాగా వేసింది. గొప్ప స్పెక్స్ మరియు భారీ ఫీచర్స్ తో 25వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో వచ్చిన ఈ హానర్ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్లతో కూడా లభిస్తోంది. లాంఛ్ ఆఫర్ లో భాగంగా కంపెనీ అందించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ మరింత తక్కువ ధరకే అందుకునే వీలుంది.

HONOR X9b 5G Price & Offers

హానర్ ఎక్స్9 బి స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రూ. 25,999 రూపాయల ధరతో లాంఛ్ చేసింది. అయితే, భారత యూజర్లను మరింత అక్కట్టుకునే విధంగా గొప్ప ఆఫర్లను కూడా ఈ ఫోన్ పైన అందించింది. ఈ ఫోన్ ను HDFC, SBI, ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి రూ. 3,000 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. Axis బ్యాంక్ డెబిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే యూజర్లకు కూడా రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.

ఒకవేళ మీరు మీ పాత ఫోన్ తో హానర్ ఎక్స్9 బి ను ఎక్స్ చేంజ్ ఆఫర్ ద్వారా కొనే వారికి రూ. 5,000 రూపాయల భారీ అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను అందుకోవచ్చు. అంటే, ఈ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ను 20 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే వీలుంది. Buy From Here

Also Read: Nothing Phone (2a) లాంఛ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కన్ఫర్మ్.!

హానర్ ఎక్స్9 బి స్పెక్స్ & ఫీచర్స్

హానర్ ఎక్స్9 బి స్మార్ట్ ఫోన్ మంచి డిజైన్ మరియు కర్వ్డ్ డిస్ప్లేతో అక్కట్టుకుంటుంది. ఈ ఫోన్ క్రింద పడినా కూడా ఎటువంటి హాని జరగకుండా చూసుకునేషాక్ అబ్జార్బ్ ఎయిర్ బ్యాగ్ (SGS) టెక్నాలజీతో వచ్చింది. అంతేకాదు, Ultra-Bounce Anti-Drop Curved AMOLED తో ఇండియన్ మార్కెట్ లో విడుదలైన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఈ డిస్ప్లే 6.78 ఇంచ్ పరిమాణంలో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది.

Honor X9b details

ఈ హానర్ స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 6 Gen 1 ప్రోసెసర్ జతగా 8GB RAM + 8GB హానర్ టర్బో RAM ఫీచర్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో 5800 mAh బిగ్ బ్యాటరీని 35W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ హానర్ స్మార్ట్ ఫోన్ 108MP మెయిన్ + 5MP అల్ట్రా వైడ్ & డెప్త్ + 2MP మ్యాక్రో కలిగిన ట్రిపుల్ కెమేరాతో వస్తుంది మరియు 4K video సపోర్ట్ ను కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :