ముఖ్యాంశాలు:
1. హానర్ V20 ఒక పంచ్-హోల్ డిస్ప్లేతో చైనాలో ప్రారంభించబడింది
2. ఇది 48MP వెనుక కెమెరాతో వస్తుంది
3. ఇది లింక్ టర్బో సాంకేతికతను కలిగి ఉంది
డిస్ప్లేలో ఒక పంచ్ హోల్ కెమెరాతో విడుదలైన మొట్టమొదటి మొబైల్, ఈ నెల ప్రారంభంలో హువావే హానర్ V20 స్మార్ట్ ఫోన్ను ప్రకటించింది. ఈ సంస్థ,ఈ ఫోను యొక్క డిజైన్ మరియు అన్ని వివరాలను బహిర్గతం చేయనప్పటికీ, ఈ పరికరం యొక్క మూడు USP లను పేర్కొంది: ఆల్-వ్యూ డిస్ప్లే, 48MP రియర్ కెమెరా మరియు లింక్ టర్బో టెక్నాలజీతో, ఇది వేగవంతమైన డౌన్లోడ్ స్పీఎదుటో Wi-Fi మరియు సెల్యులార్ కనెక్టివిటీని అందిస్తుంది. చైనాలో, ఇప్పుడు ఈ ఫోన్ అధికారికంగా తయారు చేసింది,మరియు చైనీస్ ఇ-టైలర్ VMall లో జాబితా చేయబడింది.
హానర్ వ్యూ 20, మొదటిగా హాంకాంగ్లో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించబడింది, ఇది సెల్ఫీ కెమెరా కోసం ఒక పంచ్-హోల్ డిస్ప్లే తో మరియు 48MP వెనుక కెమెరాతో కమర్షియల్ గా కంపెనీ ప్రారంభించిన మొట్టమొదటి స్మార్ట్ఫోన్. ఈ హానర్ వ్యూ 20, లేదా హానర్ V20, 6GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ CNY 2999 (దాదాపు రూ. 30,000) ధరతో ఉంటుంది. అలాగే, 8GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ కోసం వినియోగదారులు CNY 3499 (సుమారు రూ 35,500) ధర చెల్లించాల్సివుంటుంది. 8GB RAM మరియు 256GB స్టోరేజితో,హానర్ ఒక ప్రత్యేకమైన V20 మోస్చినో ఎడిషన్ను CNY 3999 (సుమారు రూ .40,000) ధరతో ప్రారంభించింది.
మోస్చినో అనేది లెథర్ ఉపకరణాలు, బూట్లు, సామాను మరియు సువాసనలతో ప్రత్యేకించబడిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా, ఈ వేరియంటును విడుదల చేస్తుందా లేదా అనే విషయం ఇంకా తెలియదు. జనవరి 22 న ప్యారిస్ లో ఈ పరికరాన్ని ఆరంభించటానికి హానర్ ఏర్పాట్లు చేస్తోంది. కొన్ని రోజుల క్రితం, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క Maserati ఎడిషన్ ఇంటర్నెట్లో కనిపించింది మరియు మోస్చినో ఎడిషన్కు బదులుగా, ప్రపంచవ్యాప్తంగా ఈ Maserati ఎడిషన్ను కంపెనీ ప్రారంభించనుంది.
హానర్ వ్యూ 20 ప్రత్యేకతలు
ఈ హానర్ వ్యూ 20, 2310×1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషనుతో ఒక పెద్ద 6.4 అంగుళాల Full HD + ఆల్-వ్యూ డిస్ప్లేని కలిగి ఉంది. ఆల్-వ్యూ డిస్ప్లే అనేది ఒక ప్యానెల్ రంధ్రంతో కూడిన డిస్ప్లేతో ఉంటుంది డిస్ప్లేలో కేవలం ఒక పానల్ రంధ్రం మాత్రమే ఉంటుంది, ఇది ఒక సెలి షూటర్ను కలిగివుంటుంది. ఎగువ ఎడమ మూలలో గుండ్రంగా 4.5mm వ్యాసంలో ఇది ఉంటుందని అని హువావే చెప్పింది. గ్లాస్ క్రింద, V- ఆకార నమూనాతో ఒక గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు రెడ్ కలర్లలో అందుబాటులో ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఆక్టా – కోర్ కిరిన్ 980 ప్రధాన చిప్సెట్ తో శక్తినిస్తుంది, ఇది 7nm ప్రాసెసుతో తయారు చేయబడుతుంది. అదే ప్రాసెసర్ Huawei యొక్క తాజా ఫ్లాగ్షిప్ అయినటువంటి, హువావే మేట్ 20 ప్రో లో చేర్చారు. ఈ పరికరం GPU టర్బో 2.0 తో వస్తుంది, ఇది గేమింగ్ సెషన్ల సమయంలో పనితీరు మరియు గ్రాఫిక్స్లను మెరుగుపరిచే సాంకేతికత అని సంస్థ చెబుతోంది. CPU ఉష్ణోగ్రత పరిశీలనలో ఉంచడానికి ఒక లిక్విడ్ కూల్ టెక్నాలజీ వ్యవస్థ కూడా ఉంది.
కెమెరా విభాగంలో, హానర్ వ్యూ 20 వెనుక 48MP సోనీ IMX586 CMOS సెన్సార్ను కలిగి ఉంది. 1.6 మైక్రో పిక్సెల్ను అందించడానికి సెన్సార్ పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. డ్యూయల్ వెనుక కెమెరా యొక్క రెండవ సెన్సార్ డెప్త్ లను పట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. డిస్ప్లేలోవున్న పంచ్ రంధ్రం f / 2.0 ఎపర్చరుతో 25MP సెన్సార్ను కలిగి ఉంటుంది. ఒక 4,000 mAh బ్యాటరీ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో ఉంది. ఈ ఫోన్ Android 9.0 Pie పైన ఆధారితమైన మేజిక్ UI 2.0 తో నడుస్తుంది.