Honor View 20 ఇండియాలో విడుదల కానుంది
ఒక 48 MP కెమేరా మరియు లింక్ టర్బో టెక్ కలిగిన ఈ హానర్ వ్యూ 20 జనవరి 29 న ఇండియాలో విడుదలకానుంది.
ముఖ్యాంశాలు:
1. హానర్ V20 ఒక 48MP వెనుక కెమెరా కలిగి ఉంది.
2. ఇది ఒక పంచ్ హోల్ డిస్ప్లే కలిగివుంటుంది.
3. ఇంటర్నెట్ కనెక్టివిటీని బూస్ట్ చేయడానికి ఒక లింక్ టర్బో టెక్నాలజీని కూడా ఈ ఫోన్ కలిగివుంది.
భారతదేశంలో హానర్ వ్యూ 20 ని విడుదల చేయడానికి, హువావే మీడియా ఆహ్వానాలను పంపింది. గత నెలలో, చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభించబడింది మరియు దాని మొదటి 48MP వెనుక కెమెరా, పంచ్-హోల్ డిస్ప్లే మరియు లింక్ టర్బో అని పిలిచే కొత్త టెక్నాలజీతో, ఈ జనవరి 29 న భారతదేశంలో విడుదలవడానికి సిద్దమవుతోంది. హానర్ నుండి వచ్చిన ఈ వ్యూ 20, ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్మార్ట్ ఫోన్ మరియు వివిధ స్టోరేజి వేరియంట్లతో, రూ .35,000- రూ .45,000 మధ్య ధరతో ఉంటుంది.
స్పెక్స్ ప్రకారం, ఈ హానర్ వ్యూ 20 ఒక 6.4-అంగుళాల పూర్తి HD + ఆల్-వ్యూ డిస్ప్లేను 2310×1080 పిక్సెళ్లతో కలిగివుంటుంది. ఈ ఆల్-వ్యూ డిస్ప్లేలో ఒక పంచ్-హోల్ ఉంది, ఇది శామ్సంగ్ ఇన్ఫినిటీ- O డిస్ప్లేల మాదిరిగానే ఒక సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ పంచ్-హోల్, స్క్రీన్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉంచబడుతుంది మరియు ఒక 4.5mm వ్యాసంలో ఉంటుంది. వెనుకవైపు, ఫోన్ గ్లాస్ డిజైన్లో ఉంటుంది, ఇది వి-ఆకార ప్యాట్రన్ కలిగి ఉంటుంది, దీని ప్రకారంగా వ్యూ 20 గా చెప్పడానికి.
ఈ స్మార్ట్ ఫోన్, హువాయ్ యొక్క ప్రధాన ఆక్టా కోర్ కిరణ్ 980 చిప్సెట్ 7nm ప్రాసెసును ఉపయోగించి తయారు చేయబడింది. ఈ ప్రాసెసర్, హువావే యొక్క మేట్ 20 ప్రో ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోనులో కూడా ఉపయోగించబడింది మరియు దీనితో పాటు కంపెనీ యొక్క GPU టర్బో 2.0, ఫోను యొక్క పనితీరు మరియు గ్రాఫిక్స్ టెక్ను పెంచుతుంది, ఇది వ్యూ 20 సొంతంగా ఉంటుంది. CPU ఉష్ణోగ్రతలను పరిశీలించడానికి ఒక ద్రవ శీతలీకరణ వ్యవస్థ(లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ) కూడా ఉంది.
ఇక ఈఫోనులోని కెమెరా విషయానికి వస్తే, ఈ వ్యూ 20 యొక్క 48MP వెనుక కెమెరా, పరిశ్రమకు మొదటిది మరియు సోనీ యొక్క IMX586 CMOS సెన్సార్ను 0.8 μm పిక్సెల్ పరిమాణంతో పొందవచ్చు, ఇది 48 మెగాపిక్సెల్స్ ప్యాక్ చేయడానికి 8.0 mm డయాగ్నల్ యూనిట్టుకు వీలుకల్పిస్తుంది. దీనితో, తక్కువ శబ్దంతో తక్కువ కాంతిలో కూడా నాణ్యతగల కాంతి చిత్రాలను తీయడంవంటివి, ఈ కెమేరా ఖాతాలో ఉండవచ్చని అర్థంచేసుకోవచ్చు. నీడల్లో కనీసపు హైలైట్ బ్లోవుట్ లు లేదా వివరాలను కోల్పోకపోవడం వంటివి కూడా ఈ కెమెరా నుంచి ఆశించవచ్చు, అయితే ఇది ఫోన్ కోసం ఇది ఎంతగా ఆప్టిమైజ్ చేయబడింది అనే విశాతం పైన ఆధారపడివుంటుంది.
డ్యూయల్ వెనుక కెమెరా యొక్క రెండవ సెన్సార్ లోతు (డెప్త్)ను పట్టుకోవటానికి ఉపయోగిస్తారు. అలాగే, డిస్ప్లేలోని పంచ్ హోల్ లోపల f / 2.0 ఎపర్చరుతో ఒక 25MP సెల్ఫీ షూటర్ని కలిగి ఉంటుంది.
వ్యూ 20 కూడా సూపర్ ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో ఒక 4,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే సమయంలో, ఈ ఫోనులో ఒక లింక్ టర్బో టెక్ ద్వారా, ఫాస్ట్ డౌన్లోడ్ వేగంతో Wi-Fi మరియు సెల్యులార్ కనెక్టివిటీని రెండింటినీ కూడా పెంచుకోవవచ్చని చెప్పబడింది. ఈ ఫోన్ తాజా Android 9 Pie OS తోఆధారితంగా మేజిక్ UI 2.0 తో నడుస్తుంది.
ఇంకా, ఈ హానర్ వ్యూ 20 రెండు వేరియంట్లలో వస్తుంది – 6GB RAM + 128GB స్టోరేజి మరియు 8GB RAM + 128GB స్టోరేజి. చైనాలో, ఈ ఫోన్ యొక్క 6GB వేరియంట్ CNY 2999 (సుమారు రూ. 30,000) ధరతో మరియు 8GB RAM వెర్షన్ CNY 3499 (సుమారు రూ .35,500) ధరతో ఉంటుంది. హానర్, 8GB RAM మరియు 256GB స్టోరేజిని CNY 3999 (దాదాపు రూ .40,000)ధరతో, ఒక ప్రత్యేకమైన మోస్చినో ఎడిషన్నుకూడా విడుదలచేసింది. అయితే, భారతదేశంలో ఈ పరికరం యొక్క ఏరకమైన వేరియంట్లు విడుదలచేయబడతాయనే విషయం మాత్రం తెలియరాలేదు.