అమెజాన్ హానర్ వ్యూ 10 (V10) స్మార్ట్ఫోన్ కొరకు రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ నెల ప్రారంభంలో హానర్ ప్రపంచవ్యాప్తంగా డివైస్ ని ప్రకటించింది మరియు ఇది జనవరి 8 న భారతదేశంలో సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఐరోపాలో హానర్ V10 € 499 (38,000) విలువైనది, అయితే, భారత్ దాని ధర 32,999 నుండి రూ .34,999 మధ్య ఉంటుంది మరియు ఇది OnePlus 5T తో పోటీపడగలదు.
Honor View 10 లో ప్రత్యేకమైనది, దీనిలో కిరిన్ 970 SOC ఉంది, ఇది AI సంబంధిత పనులను నిర్వహించడానికి ఒక న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) తో వస్తుంది. ఈ డివైస్ లో ఫుల్ విజువల్ డిస్ప్లే మరియు డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ కూడా ఉంది.హార్డ్వేర్ గురించి మాట్లాడితే , ఇది 1080 x 2160 రిజల్యూషన్ మరియు 18: 9 యాస్పెక్ట్ రేషియో తో 5.99 అంగుళాల FHD + IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ యొక్క బ్యాటరీ 3750 mAh. ఈ పరికరం ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ లో 16MP + 20MP డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ కెమెరా 13MP .ఈ డివైస్ Android 8.0 Oreo Out of the Box తో EMUI 8.0 తో నడుస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ ఉంది.