డ్యూయల్ కెమెరా తో Honor 7X కి ఫేస్ అన్ లాక్ ఫీచర్ ….

డ్యూయల్ కెమెరా తో  Honor 7X కి ఫేస్ అన్ లాక్ ఫీచర్ ….

స్మార్ట్ఫోన్ బ్రాండ్ హోనర్, భారతదేశంలో హానర్  7X యూనిట్లకు ఫేస్ అన్లాక్ ఫీచర్ను విడుదల చేసింది. భారతదేశం లో హానర్ 7X  కి OTA ద్వారా ఈ అప్డేట్ లభిస్తుంది .

Honor 7X లో లభ్యమయ్యే ఫీచర్స్ ని  చూడండి, ఇది ఒక 5.93 అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 2160 x 1080p యొక్క రిజల్యూషన్తో వస్తుంది. ఈ డివైస్  కిరిన్ 659 చిప్సెట్, 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అమర్చబడింది. ఈ హ్యాండ్ సెట్ మైక్రో SD కార్డ్ స్లాట్ కి  మద్దతు ఇస్తుంది.

Honor 7X ఒక 16MP + 2MP డ్యూయల్  వెనుక కెమెరా సెటప్ ని  కలిగి ఉంది మరియు దాని ముందు ఒక 8MP కెమెరా ఉంది. ఈ హ్యాండ్సెట్ Android 7.0 నౌగాట్  EMUI 5.1 తో నడుస్తుంది.

ఈ డివైస్ కి రియర్ -మౌంట్ చేయబడిన ఫింగెర్ప్రింట్  సెన్సార్ ఉంది. ఈ డివైస్  3340 mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు ఈ డివైస్  ఛార్జింగ్ కోసం మైక్రో  USB పోర్ట్ ని  ఉపయోగిస్తుంది.

మొబైల్ బొనంజా: ఫ్లిప్కార్ట్ లో మార్చి 13 నుండి 17 వరకు స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ డీల్స్….

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo