హానర్ ప్లే గేమింగ్ స్మార్ట్ ఫోన్ విడుదల :కిరిణ్ 970,జిపియూ టర్బో తో కూడిన ఈ ఫోన్ రూ . 19,999 రేటుతో ఇండియాలో విడుదల అయింది

హానర్ ప్లే గేమింగ్ స్మార్ట్ ఫోన్ విడుదల :కిరిణ్ 970,జిపియూ టర్బో తో కూడిన ఈ ఫోన్ రూ . 19,999 రేటుతో ఇండియాలో విడుదల అయింది
HIGHLIGHTS

హానర్ ప్లే రెండు వేరియంట్లలో లభిస్తుంది . 4జీబీ వేరియంట్ రూ . 19,999 కి లభిస్తుంది ఇంకా 6జీబీ వెర్షన్ ధర రూ . 23,999 గా ఉంది.

హానర్ తన గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయిన, హానర్ ప్లే ను చైనాలో ఆవిష్కరించిన కొద్ది నెలల తర్వాత భారతదేశంలో విడుదల చేసింది. ఫోన్ రెండు రకాల్లో లభిస్తుంది, ఒకటి 4జీబీ ర్యామ్, మరియు మరోక వేరియంట్ గా 6జీబీ ర్యామ్ తో అందిస్తుంది. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ .19,999, రూ .23,999 గా ఉన్నాయి. ఫోన్ యొక్క ముఖ్యాంశంగా చెప్పవలసింది  ఏమిటంటే  కంపెనీ యొక్క కొత్త GPU టర్బో టెక్నాలజీని అందించే మొట్టమొదటి పరికరం ఇది ఉండనుంది. ఈ ఫోన్ ఆగస్టు 6 నుంచి ప్రారంభంఅయింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి అమెజాన్ ఇండియా నుంచి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఇది నేవీ బ్లూ అండ్ మిడ్నైట్ బ్లాక్ లాంటి  రెండు రంగులలో అందుబాటులో ఉంది.

ఈ హానర్ ప్లే  19.5:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన 1080 X 2340 పిక్సెల్స్ కలిగిన  ఒక 6.3-ఇంచ్ ఐపిఎస్ ఎల్సిడి ఫుల్ హెచ్ డి + డిస్ప్లే కలిగివుంది. AI ఫీచర్ ను సమర్ధించేలా ఒక ప్రత్యేకమైన న్యూరల్ నెట్ వర్క్ ప్రాసెస్ తో కూడిన హువేయి యొక్క కిరిణ్ 970 ప్రాసెసర్ శక్తితో ఇది పనిచేస్తుంది.ఈ రెండు వేరియంట్లు కూడా 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజి తో పాటుగా స్టోరేజి సామర్ధ్యాన్నిపెంచుకునే విధంగా  మెమొరీ స్లాట్ తో ఆఫర్ చేస్తున్నాయి. 16-మెగా పిక్సెల్ మరియు 2-మెగా పిక్సెల్ యూనిట్స్ తో కూడిన డ్యూయల్-కెమేరా ని ఫోన్ వెనుక భాగం లో ప్రధాన కెమెరాగా అమర్చారు. చాల ఫోన్లలో ఉన్న విధంగానే , వివిధ రకాల సీన్లను గుర్తించే విధంగా దేనిలో సీన్ రికగ్నైజింగ్ ని అందించారు . ఇది తనంతట తానే కెమేరా సెట్టింగులను మార్చుకుంటుంది. 

హానర్ ప్లే స్పీడ్ చార్జింగ్ తో పనిచేసే ఒక 3750mAh బ్యాటరీని కలిగి ఉంది.  AI 3డి సరౌండ్ సౌండ్ మరియు AI 4D స్మార్ట్ షాక్, ఇంకా జిపియూ టర్బో లు ఇతర గేమింగ్ సెంట్రిక్ ఫీచర్స్ గా ఉన్నాయి.

ఈ జిపియూ టర్బో గ్రాఫిక్ ప్రాసెసింగ్  యొక్క సామర్ధ్యాన్ని 60 శాతం వరకు   పెంచుతుందని కంపెనీ చెబుతుంది , అంటే ఇది SoC విద్యుత్ వినియోగాన్ని 30 శాతం తగ్గించడం అన్నమాట. హానర్ కూడా మొబైల్ పరికరం యొక్క సరైన FPS ని నిర్వహించడం ద్వారా జిట్టర్ రేటు తగ్గించవచ్చని చెప్పారు. కంపెనీ ముందనె తెలిపినట్లు ,OTA అప్డేట్ ద్వారా జిపియూ టర్బో ఫీచర్ ని మరొక హానర్ డివైజ్ కి అందించవచ్చు .

మరింత ఆకర్షణీయమైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి AI ఫీచర్ ని  వాడుతుందని కూడా కంపెనీ వివరిస్తుంది. AI రియల్ – టైం చిత్ర మరియు ఆడియో గుర్తింపు ఒక 30 వేర్వేరు దృశ్యాలు మరియు 10 వేర్వేరు వైబ్రేషన్స్  కోసం అందించబడిందని హానర్ చెప్పింది.  కంపెనీ దీనిని AI 4D స్మార్ట్ షాక్ అని వర్ణించింది. దానితో, వినియోగదారులు ఆడే ఆటలోని  శత్రువులు మరియు వారి కాల్పుల సమీపించే దిశ ఆధారంగా వైబ్రేషన్  వివిధ స్థాయిలలో అనుభూతి ఇస్తుంది.  హెడ్ఫోన్స్ అనుసంధాన మద్దతుతో ఈ హానర్ ప్లే కూడా వర్చువల్ సరౌండ్ సౌండ్ అందింస్తుంది.  కంపెనీ దీనిని AI 3D సరౌండ్ సౌండ్ అని పిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo