హానర్ ప్లే గేమింగ్ స్మార్ట్ ఫోన్ :కిరిణ్ 970,GPU టర్బో శక్తితో పనిచేసే గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 6 న ఇండియా లో విడుదల కానుంది

హానర్ ప్లే గేమింగ్ స్మార్ట్ ఫోన్ :కిరిణ్ 970,GPU టర్బో శక్తితో పనిచేసే గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 6 న ఇండియా లో విడుదల కానుంది
HIGHLIGHTS

గత నెలలో చైనా లో విడుదలైన హానర్ ప్లే ఒక గేమింగ్ - సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ వుంది. ఇప్పుడిది అమెజాన్ ఎక్స్ క్లూజివ్ ద్వారా ఇండియా లోకి రానుంది. ఇండియాలో విడుదల కానున్న హానర్ ప్లే విడుదల రోజును కూడా వ్యూహాత్మకంగా నిర్ణయించారు, ఎందుకంటే మనదేశంలో విడుదల కానున్న షియోమీ యొక్క Mi A2 కన్నా రెండు రోజులు ముందుగా విడుదల చేయాలనుకోవడం దీనికి కారణం

హానర్ ప్లే స్మార్ట్ ఫోన్ ఆగష్టు 6 న ఇండియా లో విడుదల కానుంది. కొనుగోలు చేయాలనుకునే వారికోసం 'నోటిఫై మీ' బటన్ తో అమెజాన్ ఇండియా తన వెబ్సైట్ లో దీనికి సంబందించిన టీజింగ్ లను కూడా విడుదల చేసింది . 

 హానర్ ప్లే స్మార్ట్ ఫోన్ ఒక గేమింగ్-సెంట్రిక్ ఫోన్ మరియు  గ్రాఫిక్ ప్రోసెసింగ్ సమర్ధం మరియు పెరఫార్మెన్స్ అందించే విధంగా దీనిలో హువేయి యొక్క యాజమాన్య  GPU టర్బో టెక్ ని వాడారు ఈ విభాగంలో హువేయి విడుదల చేస్తున్న మొదటి ఫోన్ కూడా ఇదే . హానర్ 9N తో పాటుగా రానున్న అన్ని హానర్ మరియు హువేయి డివైజ్ లకు GPU టర్బో ఫీచర్ నే వాడాలని అంచనా వేస్తుంది .

స్పెసిఫికేషన్ విషయాని వస్తే హానర్ ప్లే లో 89 శాతం స్క్రీ-టు-బాడీ నిష్పత్తి కలిగిన ఒక 6.3-ఇంచ్ ఐపిఎస్ ఎల్సిడి ఫుల్ హెచ్ డి + డిస్ప్లే కలిగివుంది. AI ఫీచర్ ను సమర్ధించేలా ఒక ప్రత్యేకమైన న్యూరల్ నెట్ వర్క్ ప్రాసెస్ తో కూడిన హువేయి యొక్క కిరిణ్ 970 ప్రాసెసర్ శక్తితో ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్  ఎంచుకునే వీలున్న 4జీబీ మరియు 6జీబీ ర్యామ్ లతో రెండు వేరియంట్లలో లభిస్తుంది . ఈ రెండు వేరియెంట్స్ కూడా 64జీబీ ఆన్ బోర్డు మెమరీ గా హానర్ ప్లే అందిస్తుంది. అంటే కాక మరో వేరియంట్ గా 6జీబీ /128జీబీ ని కేవలం హానర్ మాత్రమే ఇండియా లో విడుదల చేయాలని చూస్తోంది, అయితే అమెజాన్ 4జీబీ వేరియెంట్ టీజర్ లో ఈ విషయాలను పేర్కొనలేదు.

 కెమేరా విషయానికి వచ్చినట్లయితే ,డ్యూయల్ -ఏఫ్మరియు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సీన్ రికగ్నైజింగ్  తో కూడిన 16-మెగా పిక్సెల్ మరియు 2-మెగా పిక్సెల్ యూనిట్స్ ని ఫోన్ వెనుక భాగం లో ప్రధాన కెమెరాగా అమర్చారు. అలాగే AI పోర్ట్రైట్ ఫీచర్ మరియు 3D పోర్ట్రైట్ లైటింగ్ సపోర్ట్ గల 16-మెగా పిక్సెల్ లెన్స్ ని అమర్చారు.

అంతేకాకుండా, మొబైల్ గేమర్స్ కోసం ఉద్దేశించబడిన 3,750 mAh బ్యాటరీ ఫోన్ కు  మద్దతుగా ఉంటుంది. ఫోన్లో ఉన్న GPU టర్బో వలన చిప్ (SoC) శక్తి వినియోగాన్ని 30 శాతం వరకు తగ్గించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది, అందువల్ల ఒక ఫోన్ ఛార్జ్ చేసినట్లయితే  ఫోన్ దీర్ఘకాలం పనిచేస్తూ ఉంటుందని అంచెనా . ఈ హానర్ ప్లే ఫోన్ సాఫ్ట్ వేర్ విషయానికొస్తే ఇది ఆండ్రాయిడ్ ఒరియో 8.1 ఆధారిత EMUI 8.2 తో పనిచేస్తుంది.

చైనాలో ఈ  ఫోన్ అరోరా బ్లూ, బ్లాక్, వైలెట్, రెడ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ఆరంభ ధర  1,999 యువాన్ (సుమారు రూ. 21,000) గా వుంది. Amazon.in టీజర్ లో ఈ  కంపెనీ భారతదేశంలో అరోరా బ్లూ అండ్ బ్లాక్ వేరియంట్లను విడుదల చేయనున్నట్లు సూచిస్తుంది. అయితే, భారతదేశం లో ఈ ఫోన్ ధర

ఎంత ఉండవచ్చునో మాత్రం ఇంకా తెలియదు. మనదేశంలో విడుదల కానున్న షియోమీ యొక్క Mi A2 కన్నా రెండు రోజులు ముందుగా విడుదల చేయాలనుకోవడాన్ని బట్టి హానర్ ప్లే షియోమీ యొక్క కొత్త ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ కి గట్టి పోటీని ఇవ్వబోతుందని తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo