Honor Magic 6 Series: అదరగొట్టే కెమేరాతో లాంఛ్ కాబోతున్న హానర్ ఫోన్.!

Updated on 21-Feb-2024
HIGHLIGHTS

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ MWC 2024 నుండి హానర్ ఫోన్స్ లాంఛ్ కి ఏర్పాట్లు

హానర్ మ్యాజిక్ 6 సిరీస్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకంగా కనిపిస్తోంది

ఈ ఫోన్ లో చాలా వేగంగా ఆటో -క్యాప్చరింగ్ చేసే ఫీచర్ ఉన్నట్లు చెబుతోంది

Honor Magic 6 Series: ఫిబ్రవరి 25న బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ MWC 2024 నుండి హానర్ ఫోన్స్ మరియు మ్యాజిక్ బుక్ ను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో, మ్యాజిక్ 6 సిరీస్ మరియు మ్యాజిక్ వి2 సిరీస్ మరియు మ్యాజిక్ బుక్ ప్రో 16 లను విడుదల చేస్తునట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఈవెంట్ నుండి విడుదల చేయనున్న వాటిలో హానర్ మ్యాజిక్ 6 సిరీస్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ భారీ కెమేరా సెటప్ మరియు ఫీచర్స్ తో ఉన్నట్లు టీజింగ్ చేస్తోంది హానర్.

Honor Magic 6 Series

MWC 2024 బార్సిలోనా నుండి విడుదల చేయనున్నట్లు చెబుతున్న హానర్ మ్యాజిక్ 6 సిరీస్ ఫోన్లలో మ్యాజిక్ 6 ప్రో గురించి ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది కంపెనీ. ఈ ఫోన్ లో చాలా వేగంగా ఆటో -క్యాప్చరింగ్ చేసే ఫీచర్ ఉన్నట్లు చెబుతోంది. అంటే, ఫోన్ ను సెటప్ చేసి పెట్టిన తరువాత ఆటొమ్యాటిగ్గా ఫోటోలను తనే సొంతంగా క్లిక్ అనిపిస్తుంది. ఈ ఫోన్ కెమేరా 100X Zoom తో ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.

ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ చాలా విలక్షణమైన సెటప్ తో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క కెమేరా AI Image అనాలసిస్ చేసి, అద్భుతమైన ఫోటో లను అందిస్తుందని కూడా హానర్ టీజర్ వీడియో ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో చాలా ప్రత్యేకమైన ఫీచర్స్ మరిన్ని ఉన్నట్లు కూడా కామేపని గొప్పగా చెబుతోంది. దీన్ని AI – Powered నెక్స్ట్ జెనరేషన్ హానర్ ఫాల్కన్ కెమేరా సిస్టంగా చెబుతోంది.

Also Read: Realme 12+ 5G: రియల్ మి 12 సిరీస్ నుండి వస్తున్న మరో స్మార్ట్ ఫోన్.!

ఈ ఫోన్ బ్యాటరీ గురించి కొద కంపెనీ గొప్పగా చెబుతోంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను సెకండ్ జెనరేషన్ సిలికాన్ – కార్బన్ బ్యాటరీతో లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ బ్యాటరీ అత్యంత వేడి మరియు చల్లని వాతావరణ పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా అధిక కాలం మన్నుతుందని కూడా కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ దాదాపుగా 13 గంటల పాటు నిరంతర యూట్యూబ్ ప్లే బ్యాక్ ను అందించేంత శక్తిని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :