Honor Magic 6 Pro: ఇండియాలో విడుదలవుతున్న హానర్ సూపర్ కెమెరా ఫోన్.!
Honor Magic 6 Pro ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ అవుతోంది
5 DXOMARK 2024 గోల్డ్ లేబుల్స్ అందుకున్న మొదటి ఫోన్ ఇదే
ఈ సూపర్ ఫోన్ ను ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా విడుదల చేయడానికి హానర్ రెడీ అయ్యింది
Honor Magic 6 Pro: గ్లోబల్ మార్కెట్ లో ఇటీవల హానర్ విడుదల చేసిన హానర్ సూపర్ కెమెరా ఫోన్ హానర్ మ్యాజిక్ 6 ప్రో ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ అవుతోంది. 5 DXOMARK 2024 గోల్డ్ లేబుల్స్ అందుకున్న మొదటి ఫోన్ ఇదే. ఈ సూపర్ ఫోన్ ను ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా విడుదల చేయడానికి హానర్ రెడీ అయ్యింది.
Honor Magic 6 Pro: లాంచ్
హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 2వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో మంచి అమ్మకాలను సాధించింది. ఈ హానర్ ఫోన్ ప్రీమియం ఫోన్ మరియు 5 DXOMARK 2024 గోల్డ్ లేబుల్స్ అందుకున్న మొదటి ఫోన్ గా నిలిచింది.
Honor Magic 6 Pro: ఫీచర్లు
హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా మరియు ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరా ని కలిగి ఉంటుంది. ఈ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ లో వెనుక పవర్ ఫుల్ 180MP పెరిస్కోప్ కెమెరా + 50MP హానర్ ఫాల్కన్ కెమెరా + 50MP అల్ట్రా వైడ్ కెమెరా లతో ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. అలాగే, ముందు 50MP + 3D డెప్త్ కెమెరా కలిగిన డ్యూయల్ సెల్ఫీ కెమెరా వుంది.
ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 3 తో అందిస్తోంది. ఈ పవర్ ఫుల్ ప్రోసెసర్ కి జతగా సూపర్ కనెక్టివిటీ కోసం Honor C1 + RF ఎన్ హెన్సెడ్ చిప్ సెట్ ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఫోన్ సెక్యూరిటీ కోసం ఈ ఫోన్ లో ప్రత్యేకమైన చిప్ సెట్ ను కూడా హానర్ అందించింది. ఈ ఫోన్ 5600mAh హెవీ బ్యాటరీని 80W వైర్డ్ సూపర్ ఛార్జ్ సపోర్ట్ మరియు 66W వైర్ లెస్ సూపర్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.
Also Read: ఈరోజు 22 వేల భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న Samsung ప్రీమియం ఫోన్.!
ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే ని కూడా అందించింది. ఈ హానర్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Dolby Vision మరియు HDR Vivid సపోర్ట్ కలిగిన 6.80 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1-120Hz అడాప్టివ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు స్క్రీన్ పైన నానో క్రిస్టల్ షీల్డ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.