హానర్ నోట్ 10 ఇప్పుడు హువాయ్ యొక్క నెక్స్ట్-జెన్ కిరిణ్ 980 ప్రాసెసర్ తో IFA లో ఆగష్టు 30 వ తేదీన విడుదల కానుంది .

Updated on 27-Jul-2018
HIGHLIGHTS

హానర్ నోట్ 10 ఇప్పుడు హువాయ్ యొక్క నెక్స్ట్-జెన్ కిరిణ్ 980 ప్రాసెసర్ తో IFA లో ఆగష్టు 30 వ తేదీన విడుదల కానుంది .

ఈ సంవత్సరం మే నెలలో , హానర్ కంపెనీ ఇండియా లో ఆవిష్కరించిన హానర్10 స్మార్ట్ ఫోన్ టూ-టోన్ గ్లాస్ మరియు డ్యూయల్ కెమేరాలతో డిజైన్ చేయబడిన .విడుదల చేసినప్పుడు దీని ధర 32,999 గా కంపెనీ ప్రకటించింది . అంతేకాక రెండు నెలల వ్యవధి లోనే 3 మిలియన్ ఫోన్ యూనిట్స్ ను ప్రపంచ వ్యాప్తంగా అమ్మినట్లు కంపెనీ తెలిపినింది . చైనా తో మిళితమైన తరువాత దానికన్నా  శక్తివంతమైన ఫోన్ వెర్షన్ ఆయిన హానర్ 10జిటీ ని చైనా లో విడుదల చేసింది . చూస్తుంటే కంపెనీ ఇప్పుడు హానర్ 10 లైన్ అప్ కు కొనసాగింపుగా హానర్ నోట్ 10 ని ఆగష్టు 30 వ తేదీన జరిగే బెర్లిన్ లో జరిగే టెక్నాలజీ షో IFA లో ఆవిష్కరించనుందని తెలుస్తోంది.

 

ఒక రిపోర్ట్ ఆధారంగా , IFA ఈవెంట్ కోసం హానర్ ఆహ్వానాలను పంపడం మొదలుపెట్టిందని తెలుస్తోంది . ఆ ఆహ్వానం లో – హానర్ ఇన్వైట్స్ యు టూ ఏ న్యూ ప్రోడక్ట్ లాంచ్ " అంటే " ఒక క్రొత్త ప్రోడక్ట్ విడుదల కు హానర్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది " అని అర్ధం . 'క్రేజీ ఫాస్ట్ ,క్రేజీ స్మార్ట్ ' అని దీనికి క్యాప్సన్ గా పెట్టారు ఇంకా దూసుకెళుతున్న బులెట్ ని ఇమేజ్ లో చూపించారు . అంటే  కిరిణ్ 980 , లాంటి ఫాస్ట్ ప్రాసెసర్ తో పనిచేసే ఒక ఫోన్ ని కంపెనీ విడుదల చేయబోతుందని  అర్ధమవుతుంది . ఈ ఫోన్ లో ఉన్న AI – కేపబిలిటీస్ ని గమనిస్తే హానర్ తన ఫోన్ల లో స్మార్ట్ ఫీచర్ ని అందించడం మీద ద్రుష్టి సారిస్తుందని తెలుస్తుంది.

 

ఇటీవలే హానర్ నోట్ 10 యొక్క  క్రీడా కోడ్ నేమ్ – HUAWEI RVL-AL 09 గా  గీక్ బెంచ్ పాప్ చేసింది . ఇది కంపెనీ యొక్క నెక్స్ట్-జనరేషన్ కిరిణ్ 980 SoC ద్వారా పనిచేస్తుందని స్మార్ట్ ఫోన్ విభాగ ప్రధాన టెక్నాలిజీ అధికారి అయిన హి గ్యాంగ్ చేత  రాబోయే IFA లో విడుదల చేయబోతున్నారని  అంచనా.గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారంగా ఇది 6జీబీ తో పనిచేస్తుందని ఇంకా ఇది హువాయ్ పి 20 ప్రో లో ఉన్న మెమోరీ మరియు ప్రాసెసర్ కు సమానంగా ఉంటుంది . అయితే మనకు లిస్టింగ్ మీద అనుమానం కలగవచ్చు కానీ కిరిణ్ 980 ఒక్క విడుదల ఫోన్ విడుదల యాదృచ్చికంగా జరిగాయి తప్ప ఇది నిజమే.

 

ఒక ప్రత్యేకమైన రిపోర్ట్ ప్రకారం హానర్ తన హానర్ నోట్ 10 లో రోల్స్ రాయిస్ ఎడిషన్ కూడా విడుదల చేయబోతోందని అంచనా . స్లాష్ లీక్ దీనికి సంభందించి  ఒక ఇమేజ్ ని పోస్టుచేసింది ఇందులో మధ్యలో నిలువుగా  అనుసంధానించిన డ్యూయల్ కెమేరా తో పాటుగా  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంచబడింది . గిగ్మో చైనా ప్రకారంగా హానర్ నోట్ 10 రోల్స్ రాయిస్ ఎడిషన్  ఒక మిర్రర్ సిల్వర్ రంగులో ఉంటుందని దాని యొక్క ధర ఇంచుమించుగా  9998 Yuan (Rs 1,02,730) గ ఉంటుందని అంచనా .ఈ డివైజ్ యొక్క వివరాల కోసం ఆగష్టు 30 వరకు వేచి ఉండాల్సిందే. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :