ప్రముఖ చైనీస్ బ్రాండ్ Honor ఇండియాలో గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తోంది మరియు 200MP భారీ కెమేరాతో Honor 90 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. హానర్ బ్రాండ్ గతంలో చాలా గొప్ప స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. అయితే, అనేక కారణాల వలన భారత్ మార్కెట్ లో Honor Smartphone లు కనుమరుగయ్యాయి. అయితే, ఇప్పుడు భారత్ లో హానర్ రీ ఎంట్రీ కనర్మ్ అయ్యింది.
హానర్ యొక్క అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Honor 90 5G launch Date యూ కంపెనీ అనౌన్స్ చేసింది. Honor 90 5G స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ హానర్ ఫోన్ కోసం అమేజాన్ ప్రత్యేకమైన మైక్రో పేజ్ అందించింది. అంతేకాదు, ఈ మైక్రో సైట్ పేజ్ నుండి ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ గురించి టీజింగ్ చేస్తోంది.
Honor 90 5G స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ ను అమేజాన్ మైక్రో సైట్ పేజ్ లో వివరించింది. Honor 90 5G స్మార్ట్ ఫోన్ ను 200MP ultra-Clear కెమేరాతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే, ఈ హానర్ ఫోన్ వెనుక ఉన్న కెమేరా సెటప్ కొత్త డిజైన్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అంతేకాదు, హానర్ 90 5జి ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమేరాని కూడా హానర్ కనర్మ్ చేసింది. ఈ కెమేరా సెటప్ honor image engene సెటప్ తో వస్తుంది.
ప్రపంచంలోనే కళ్ళకు అత్యంత సురక్షితమైన ఫోన్ గా హానర్ 90 లాంచ్ అవుతుందని కంపెనీ గొప్పగా చెబుతోంది. దీనికి తగిన కారణాలను కూడా హానర్ టీజింగ్ ద్వారా వివరించింది. హానర్ ప్రకారం, ఈ ఫోన్ లో వున్న డిస్ప్లే 5-Fold Eye protection తో వస్తుంది. ఇందులో రిస్క్ ఫ్రీ డిమ్మింగ్, డైనమిక్ డిమ్మింగ్, సర్కేడియన్ నైట్ డిస్ప్లే , లో బ్లూ లైట్ మరియు లో లైట్ డిమ్మింగ్ అడ్జెస్ట్ మెంట్ తో ఇది కళ్ళకు రక్షణ ఇస్తుందని హానర్ తెలిపింది.
Honor 90 5G ఫోన్ క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ ను 1.5 K రిజల్యూషన్ మరియు 1600 నిట్స్ బ్రైట్నెస్ తో కలిగి వుంటుంది.ఈ ఫోన్ ను లేటెస్ట్ MagicOS 7.1 సాఫ్ట్ వేర్ పైన నడిచే Android 13 OS తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇప్పటి వరకూ హానర్ తెలిపి వివరాలు ప్రకారం చూస్తుంటే Honor 90 5G స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయడానికి హానర్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.