హానర్ కొత్త ఫోన్ Honor 90 5G 19GB RAM మరియు 512GB స్టోరేజ్ తో ఇండియాలో లాంచ్ కి సిద్దమయ్యింది. ఇప్పటికే Honor 90 5G స్మార్ట్ ఫోన్ చైనాతో పాటుగా మలేషియా వంటి చాలా ఆసియా దేశాల్లో లాంచ్ అయ్యింది. ఇతర దేశాల్లో లాంచ్ అయిన Honor 90 5G డిస్ప్లే విభాగంలో Dxomark నుండీ 140 స్కోర్ ను నమోదు చేసినట్లు హానర్ గొప్పగా చెబుతోంది. హానర్ 90 5జి స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుండగా ఈ ఫోన్ యొక్క RAM మరియు Storage గురించి కంపెనీ టీజింగ్ మరింత ఆకట్టుకుంటోంది.
Honor 90 5G స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ భాగంగా హానర్ ఈ ఫోన్ యొక్క RAM మరియు స్టోరేజ్ లను వెల్లడించింది. ఈ ఫోన్ ఇతర దేశాల్లో మూడు వేరియంట్స్ లో విడుదలయ్యింది. ఇందులో, హై ఎండ్ వేరియంట్ 12GB + 7GB వర్చువల్ RAM మరియు జతగా 512GB భారీ స్టోరేజ్ ను కలిగి వుంది. హానర్ ప్రస్తుతం వెల్లడించిన టీజింగ్ స్పెక్స్ ఆధారంగా ఈ ఫోన్ అదే అవుతుందని ఊహిస్తున్నారు.
ఇతర మార్కెట్ లావు విడుదల చేసిన Honor 90 5G ఫోన్ డిస్ప్లే Dxomark నుండీ 140 స్కోర్ అందుకున్నట్లు గొప్పగా చెబుతోంది. Honor 90 5G స్మార్ట్ ఫోన్ 200MP కెమేరాని మరియు ముందు 50MP సెల్ఫీ కెమేరా సెటప్ ను కలిగి వుంది. Honor 905G Global వేరియంట్ ఫ్రెంట్ అండ్ బ్యాక్ రెండు కెమేరాలు కూడా 4K Video రికార్డ్ సపోర్ట్ తో వున్నాయి.
Also Read: Aadhaar New Scam: మెసేజ్ మరియు లింక్స్ తో స్కామర్ల వల..ఈ mistake చెయ్యకండి.!
ఇండియన్ వేరియంట్ కూడా ఇదే ప్రత్యేకతలతో వచ్చే అవకాశం వుంది. ఈ ఫోన్ ను Snapdragon 7 Gen 1 Accelerated Edition తో లాంచ్ చేస్తోంది హానర్.
ఈ ఫోన్ లాంచ్ కంటే ముందుగానే ఈ ఫోన్ పైన ఇండియన్ మార్కెట్ లో అంచనాలను పెంచేసింది హానర్. అయితే, ఇక్కడ మార్కెట్ లో ఫీచర్స్ తో పాటుగా ధర కూడా కీలకమైన భాగం కాబట్టి, ఈ ఫోన్ ధరను బట్టి ఫోన్ మార్కెట్ వాటా తెలుస్తుంది.