digit zero1 awards

జబర్దస్త్ అఫర్: Honor 90 5G పైన ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ అఫర్.!

జబర్దస్త్ అఫర్: Honor 90 5G పైన ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ అఫర్.!
HIGHLIGHTS

Honor 90 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది హానర్ కంపెనీ.

Honor 90 5G స్మార్ట్ ఫోన్ ను 200MP అల్ట్రా క్లియర్ కెమేరా వంటి భారీ ఫీచర్ లతో తీసుకొచ్చింది

Honor 90 5G పైన ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ అఫర్ లను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది

ఇండియన్ మార్కెట్ లో Honor 90 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది హానర్ కంపెనీ. హానర్ 90 5జి స్మార్ట్ ఫోన్ ను 200MP అల్ట్రా క్లియర్ కెమేరా, జబర్డస్త్ డిస్ప్లే మరియు Snapdragon లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ వంటి భారీ ఫీచర్ లతో తీసుకొచ్చింది. అంతేకాదు, Honor 90 5G పైన ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ అఫర్ లను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇండియన్ మొబైల్ మార్కెట్ ను షేక్ చేస్తున్న ఈ హానర్ జబర్దస్త్ అఫర్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

Honor 90 5G discount offers

Honor 90 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 37,999 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించిన హానర్ ఈ ఫోన్ ను తక్కువ ధరలో అందుకునేందుకు వీలుగా రూ. 10,000 వరకూ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది. ఈ హానర్ ఫోన్ పైన రూ. 5,000 కూపన్ అఫర్ ను లాంచ్ అఫర్ లో భాగంగా అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు SBI కార్డ్స్ ద్వారా కొనేవారికి రూ. 3,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను అందిస్తోంది కంపెనీ. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ వాల్యూ ని కూడా అందించింది. 

అంటే,  5000 (కూపన్ అఫర్) + 3000(బ్యాంక్ అఫర్) + 2000 (అదనపు ఎక్స్ ఛేంజ్) తో కలిపి మొత్తం రూ. 10,000 డిస్కౌంట్ ను ఈ పైన పొందే వీలుంది. ఈ ఫోన్ అమేజాన్ నుండి ఈ భారీ ఆఫర్లతో సేల్ అవుతోంది. అఫర్ లతో Honor 90 5G స్మార్ట్ ఫోన్ కొనడానికి Buy From Here లింక్ పైన క్లిక్ చేయండి    

Honor 90 5G Specs

హానర్ 90 5G స్మార్ట్ ఫోన్ రిస్క్ ఫ్రీ డిమ్మింగ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ లో 120Hz Quad-Curved Floating AMOLED డిస్ప్లే HDR సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్ కామ్ Snapdragon 7 Gen 1 Accelerated Edition ప్రోసెసర్ కి జతగా (12GB RAM + 7GB) టోటల్ 19GB RAM మరియు 512GB స్టోరేజ్ తో అద్భుతమైన పెర్ఫార్మన్స్ అందించ గలదు. హానర్ 90 స్మార్ట్ ఫోన్ Android 13 OS ఆధారితమైన  Magic OS 7.1 సాఫ్ట్ వేర్ పైన పని చేస్తుంది. 

కెమేరా పరంగా ఈ ఫోన్ మరింతగ ఆకట్టుకుంది. ఎందుకంటే, Honor 90 5G స్మార్ట్ ఫోన్ 200MP Ultra-Clear Rear మెయిన్ కెమేరాకి జతగా  12MP అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో (2-in-1) కెమేరా 2MP సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ మరియు 50MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. Honor 90 5G స్మార్ట్ ఫోన్ కెమేరాతో 10X Digital zoom మరియు 4K (3840×2160) వీడియో రికార్డింగ్ కెపాసిటీ తో పాటుగా సెల్ఫీ కెమేరాతో కూడా 4K వీడియో రికార్డింగ్ చేసే వీలుంది. 

అంతేకాదు పెద్ద 5000 mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo