Honor 90 5G price in India: భారీ ఫీచర్స్ తో భారత్ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చిన హానర్.!

Honor 90 5G price in India: భారీ ఫీచర్స్ తో భారత్ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చిన హానర్.!
HIGHLIGHTS

Honor 90 5G price in India: భారీ ఫీచర్స్ తో భారత్ మార్కెట్ లో ఎంట్రీ

హానర్ 90 5G స్మార్ట్ ఫోన్ 200MP కెమేరా, టాప్ డిస్ప్లే వంటి ఫీచర్ లతో అడుగు పెట్టింది

Honor 90 5g సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అమేజాన్ ద్వారా సేల్ అవుతుంది

Honor 90 5G price in India: భారీ ఫీచర్స్ తో భారత్ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చిన హానర్. గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్ నుండి అవుట్ అయిన హానర్, Honor 90 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. హానర్ 90 5G స్మార్ట్ ఫోన్ 200MP కెమేరా, టాప్ డిస్ప్లే వంటి చాలా ప్రీమియం ఫీచర్ లతో ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టింది. ఈ ఫోన్ ను ముందుగా చైనా, మలేషియా వంటి ఆసియా దేశాల్లో విడుదల చేసిన హానర్ ఇప్పుడు ఇండియాలో కూడా విడుదల చేసింది. 

Honor 90 5G price in India

Honor 90 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 37,999 రుపాయల ప్రారంభ ధరతో పాటుగా ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడా లాంచ్ చేసింది.

Honor 90 5g offers

హానర్ 90 5జి స్మార్ట్ ఫోన్ ను ICICI & SBI డెబిట్, క్రెడిట్ మరియు EMI అఫర్ తో కొనే వారికి రూ. 3,000 డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా కొనే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ను కూడా అఫర్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు, రూ. 5,000 రూపాయల వరకు Freebie లను కూడా అందిస్తున్నట్లు హానర్ 90 5జి ఫోన్ లాంచ్ సమయంలో తెలిపింది. Honor 90 5g స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అమేజాన్ ద్వారా సేల్ అవుతుంది. 

Honor 90 5g specifications

ఈ హానర్ కొత్త ఫోన్ 6.7 ఇంచ్ Quad-Curved ఫ్లోటింగ్ స్క్రీన్ ను AMOLED డిస్ప్లేతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 93.% స్క్రీన్ టూ బాడీ రేషియాతో ఉంటుంది. హానర్ ఈ కొత్త ఫోన్ ను Snapdragon 7 Gen 1 Accelerated Edition ప్రోసెసర్ తో పని చేస్తుంది. హానర్ 50 5G స్మార్ట్ ఫోన్ 19 GB వరకూ RAM (వర్చువల్ ర్యామ్ తో కలిపి) మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందించ గలదని హానర్ చెబుతోంది. 

Honor 90 5g Camera ల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 200MP మెయిన్ కెమేరా + 12MP అల్ట్రా వైడ్/మ్యాక్రో + 2MP డెప్త్ కెమేరాతో వస్తుంది. ఈ ఫోన్ కెమేరా 10X Digital zoom, 4K (3840×2160) వీడియో రికార్డింగ్ మరియు టన్నుల కొద్దీ కెమేరా ఫీచర్ లతో ఉంటుంది. అలాగే, ముందు భాగంలో ఉన్న 50MP సెల్ఫీ కెమేరాతో కూడా 4K Video లను తియ్యవచ్చని కంపెనీ తెలిపింది. 

ఈ హానర్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 66W Super Charge సపోర్ట్ తో కలిగి ఉంటుంది.  ఈ ఫోన్ లో HONOR Histen 7.1 సౌండ్ ఎఫక్ట్ వుంది మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS ఆధారమైన MagicOS 7.1 సాఫ్ట్ వేర్ పైన పని చేస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo