Honor 8X కిరణ్ 710 SoC మరియు 6.5-అంగుళాల పూర్తి-HD + డిస్ప్లేతో భారతదేశంలో అక్టోబర్ 16 విడుదలవనుంది

Honor 8X  కిరణ్ 710 SoC మరియు 6.5-అంగుళాల పూర్తి-HD + డిస్ప్లేతో భారతదేశంలో అక్టోబర్ 16 విడుదలవనుంది
HIGHLIGHTS

ఈ హానర్ 8X కంపెనీ యొక్క కిరిన్ 710 SoC తో శక్తినిచ్చేది మరియు ఇది 12nm నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. ఇది గతేడాది వచ్చిన హానర్ 7X కి వారసునిగా ఉంటుంది.

దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో, ఆనర్ 8X స్మార్ట్ఫోన్ గ్లోబల్ లాంచ్ ని ప్రకటించింది మరియు ఇది అక్టోబర్ 16 న భారతదేశంలో విడుదలకానున్నట్లు   ధ్రువీకరించింది. ఇప్పటి వరకు చైనా ప్రత్యేక ఫోన్ గా వున్న హానర్ 8X మాక్స్ తో పాటు, ఈ నెలలోనే ఈ స్మార్ట్ ఫోన్ ని ప్రకటించారు. మొత్తంగా – గ్లాస్ బ్యాక్ మరియు ద్వంద్వ-వెనుక కెమెరా సెటప్ కలిగి ఉన్న, హానర్ 8X ఒక 18.7: 9 డిస్ప్లే కారక నిష్పత్తితో గల ఒక 6.5-అంగుళాల నోచ్  స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ సంస్థ, దుబాయ్ లో AED999 (సుమారు రూ .19,930) వద్ద హానర్ 8X యొక్క ధరను ప్రకటించింది, అయితే రియల్మీ 2 ప్రో , రెడ్మి నోట్ 5 ప్రో వంటి మరికొన్నిఫోన్లకి గట్టి పోటీ ఇవ్వడానికి ఇది భారతదేశంలో ధర తక్కువతో విడుదలైయ్యే అవకాశముంది.

Honor 8X ప్రత్యేకతలు

ఈ హానర్ 8X ఒక ఆక్టా – కోర్ HiSilicon కిరిన్ 710 SoC చే శక్తినిస్తుంది. ఇది రెండు వైవిధ్యాలైన, 4GB RAM మరియు 64GB అంతర్గత నిల్వ మరియు 6GB RAM తో, 64GB లేదా 128GB గాని విస్తరించదగిన నిల్వ ఎంపికలతో వస్తుంది. ముందు చెప్పినట్లుగా, ఇది 6.5 అంగుళాల ఫుల్ – HD + TFT IPS డిస్ప్లే  1080×2340 రిజల్యూషన్తో మరియు 18.7: 9 కారక నిష్పత్తితో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో తో కూడిన EMUI 8.2.0 స్కిన్ పై నడుస్తుంది, ఈ మొత్తం ప్యాకేజీకి 3750mAh బ్యాటరీ శక్తినందిస్తుంది.

Honor 8X India launch intext.jpg

ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ద్వంద్వ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇక్కడ, ప్రాధమిక కెమెరాకి f / 1.8 ఎపర్చరుతో కూడిన 20MP సెన్సార్ ఉంది మరియు 2MP సెకండరీ సెన్సార్ ఉంది. ముందు భాగంలో, ఇది f / 2.0 ఎపర్చరుతో ఒక16MP లెన్స్తో వస్తుంది. ఇది 3.5mm హెడ్ఫోన్ జాక్ కలిగి ఉంటుంది.

చైనాలో, 4GB / 64GB మోడల్ కోసం యువాన్ 1,399 (సుమారు రూ. 14,700) ప్రారంభ ధర వద్ద ఉండగా, దాని 6GB / 64GB మోడల్ యువాన్ 1,599 (సుమారు రూ. 16,800) ధరతో ఉంటుంది. దీని మరొక 6GB / 128GB వేరియంట్ యువాన్ 1,899 (సుమారు Rs. 20,000) ధరతో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo