Honor 7X డిసెంబర్ లో ఇండియా లో లాంచ్ , ఇదే ధర .

Honor 7X  డిసెంబర్ లో ఇండియా లో లాంచ్ ,  ఇదే ధర .

డిసెంబర్ నాటికి చైనా కంపెనీ హువావై సబ్ బ్రాండ్  హానర్ యొక్క  హొనర్ 7X హ్యాండ్సెట్  ని భారతీయ వినియోగదారులకు విడుదల చేయనుంది. గత సంవత్సరం ప్రారంభించిన హానర్  6X యొక్క అప్గ్రేడెడ్  వెర్షన్ గా పరిగణించబడుతుందని  అంటున్నారు .
జార్జ్ జావో వచ్చే నెల డిసెంబర్ లో ఆనర్ 7x స్మార్ట్ఫోన్ భారతదేశం లో పరిచయం అవుతుంది అన్నారు. ఈ ఫోన్ గత నెల అక్టోబర్లో చైనీస్ వినియోగదారులకు ప్రారంభింపబడింది . ఫోన్ 32GB, 64GB మరియు 128GB మూడు వేరియంట్లలో  చైనా లో ప్రారంభించింది ,  32GB స్టోరేజ్ వేరియంట్ ధర 1299 యువాన్ అంటే  12,800 రూపాయలు, మరియు  64GB  వేరియంట్ ధర 1699 యువాన్,  అంటే  16,800 రూపాయిలు  ,ఇక 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర   రూ 1999 యువాన్  అంటే 19,800 రూపాయలు .  అన్ని మోడళ్లకు 4 GB RAM ఇవ్వబడిందని సమాచారం .
మిగిలిన ఫీచర్స్  గురించి చర్చిస్తే , ఆనర్ 7X హ్యాండ్ సెట్లో 16-మెగాపిక్సెల్స్ మరియు 2-మెగాపిక్సెల్ రేర్  కెమెరా సెటప్ ఉంది. ఫోన్లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్లో 5.93-అంగుళాల ఫుల్ HD + (1080 × 2160 పిక్సెల్స్) కర్వ్ర్డ్ డిస్ప్లే ఉంది, ఇది 18: 9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో ని సపోర్ట్ చేస్తుంది.
ఈ హ్యాండ్సెట్ లో  ఆక్టో -కోర్ హైస్లికోన్ కిరిన్ 659 Soc  ప్రాసెసర్ ఇవ్వబడింది.  Android 7.0  నౌగాట్ బేస్డ్  EMUI 5.1 పై నడుస్తుంది. ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్  ఉంది మరియు 3340mAh బ్యాటరీ  ఇవ్వబడుతుంది. మరోవైపు, కనెక్టివిటీకి సంబంధించి 4G VoLTE Wi-Fi 802.11b / g / n, బ్లూటూత్ 4.1 LE, GPS / GLONASS ఫీచర్లను మద్దతు ఇస్తుంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo