Honor 7A స్మార్ట్ఫోన్ ఈ ఫీచర్స్ తో లాంచ్ , ధర తెలుసుకోండి…
హానర్ తన కొత్త స్మార్ట్ఫోన్ చైనాలో హానర్ 7A ను ప్రారంభించింది. ఇది బడ్జెట్ స్మార్ట్ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకత డ్యూయల్ కెమెరాతో మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ తో అమర్చబడి ఉంటుంది. దీనితో పాటుగా స్నాప్డ్రాగెన్ 430 చిప్సెట్ కొత్త స్మార్ట్ఫోన్లో కలదు .
ఆనర్ 7A స్మార్ట్ఫోన్ అనేక స్టోరేజ్ వేరియంట్స్ తో చైనా లో పరిచయం చేయబడింది, RAM 2GB మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 799 అంటే సుమారు 8,300 రూపీస్ , 3GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 999 అంటే సుమారు రూ .10,300 లో లభ్యం . అరోరా బ్లూ, బ్లాక్ మరియు ప్లాటినం గోల్డ్ రంగుల్లో స్మార్ట్ ఫోన్ లభ్యం . ఇవే కాకుండా, ఈ స్మార్ట్ఫోన్ ని నేడు అనగా ఏప్రిల్ 3 నుంచి కొనుగోలు చేయవచ్చు.
స్మార్ట్ఫోన్ స్పెక్స్ గురించి చర్చిస్తే ఈ స్మార్ట్ఫోన్ డ్యూయల్ SIM మద్దతు మరియు Android Oreo తో ప్రారంభించబడింది . దీనికి అదనంగా మీరు 720×1440 పిక్సెల్ రిజల్యూషన్తో 18: 9 యాస్పెక్ట్ రేషియో తో 5.7 అంగుళాల HD + డిస్ప్లేని పొందుతారు . ఫోన్ ఆక్టా -కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430 ప్రాసెసర్తో ప్రారంభించబడింది. ఒక 3000 mAh బ్యాటరీ కూడా ఫోన్లో అందుబాటులో ఉంది.
కెమెరా గురించి చర్చించినట్లయితే, RAM మరియు స్టోరేజ్ వేరియంట్లలో కొంత వ్యత్యాసం ఉంటుంది. 3GB రామ్ వేరియంట్ మీరు ఒక 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు ఒక 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా పొందుతారు .2జీబీ వేరియంట్ లో 13-మెగాపిక్సెల్ రేర్ కెమెరా, మరియు రెండు వేరియంట్ లో 8-మెగాపిక్సెల్ ముందు కెమెరాలు కలవు . మీరు మైక్రో SD కార్డు సహాయంతో ఫోన్ యొక్క స్టోరేజ్ 128GB వరకు విస్తరించవచ్చు.