huawei కంపెని సబ్ బ్రాండింగ్ హానర్ యొక్క కొత్త మోడల్ కోసం అఫిషియల్ గా weibo వెబ్ సైట్ లో లాంచ్ టిసర్ ను పోస్ట్ చేసింది. మొబైల్ పేరు, హానర్ ప్లే 5x. ప్రైస్ 10,000 లోపు ఉంటుంది అని అంచనా.
ఆండ్రాయిడ్ హెడ్ లైన్స్ లో లాంచ్ ఈవెంట్ ఇన్విటేషన్ కూడా బయటకు వచ్చింది. దీనిలో మోడల్ కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాని, గతంలోనే ప్లే 5x స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.
రిపోర్ట్స్ ప్రకారం ప్లే 5x లో 5 in 720P HD డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ SoC, 2gb ర్యామ్, 16 gb ఇంబిల్ట్ అండ్ 32gb sd కార్డ్ సపోర్ట్, 5MP ఫ్రంట్ 13MP రేర్ కెమెరా ఉండనున్నాయి.
దీనితో పాటు త్వరలో హానర్ 5x (Play కాదు) మోడల్ కూడా లాంచ్ చేయనుంది కంపెని. 5x లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన హానర్ 4x కు అప్ గ్రేడ్ మోడల్. దీనిలో 5x ప్లే కన్నా పెద్ద స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
గత నెల Tenaa వెబ్ సైట్ లో కనిపించింది 5x మోడల్. దీనిలో 5.5 in FHD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 ఆక్టో కోర్ SoC, 3gb ర్యామ్, 32ఇంబిల్ట్ స్టోరేజ్, 4G. అయితే 5X అనౌన్స్ డేట్ పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు కంపెని.
ఇమేజ్ ఆధారం: Tenaa, ఫోన్ అరేనా