ఇండియాలో హానర్ నుండి రెండు స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి ఈ రోజు. ఒకటి హానర్ 5X, ప్రైస్ – 12,999 రూ. మరొకటి హానర్ Holly 2 plus, ప్రైస్ – 8,499 రూ.
5X చైనాలో అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యింది ఆల్రెడీ, Holly 2 ప్లస్ మాత్రం ఇదే మొదటి సారిగా లాంచ్. హానర్ 5X మొదటి ఇంప్రెషన్స్ ఆల్రెడీ ఈ లింక్ లో తెలియజేశాము.
హానర్ 5X స్పెక్స్ – మెటల్ డిజైన్, డ్యూయల్ సిమ్, 4G LTE, 5.5 in FHD 441PPi డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 616 SoC, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.
128GB SD కార్డ్ స్టోరేజ్, 13MP రేర్ కెమెరా with డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ – ఆటో ఫోకస్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్యాక్ సైడ్, 3000 mah బ్యాటరీ.
Holly 2 ప్లస్ స్పెక్స్ – ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన హానర్ holly కు నెక్స్ట్ మోడల్. డ్యూయల్ సిమ్, 5 in HD డిస్ప్లే, మీడియా టెక్ MT6753 1.3GHz SoC.
2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్, 13MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 4000 mah బ్యాటరీ ఉన్నాయి. రెండు మోడల్స్ ఫ్లిప్ కార్ట్ అండ్ అమెజాన్ లో సెల్ అవనున్నాయి.
Holly 2 ప్లస్ ఓపెన్ సేల్స్, హానర్ 5X ఫ్లాష్ సెల్. 5X ప్రీ ఆర్డర్స్ ఈ రోజు నుండి స్టార్ట్. ఫిబ్రవరి 1 న ఫ్లాష్ సెల్. Holly 2 ప్లస్ ఫిబ్రవరి 15 నుండి మొదలు. రెండు మొబైల్స్ కు 15 నెలలు వారంటీ ఉంది.