ఇండియన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యూజర్ దగ్గర స్లోగా నమ్మకం తెచ్చుకున్న Huawei Honor బ్రాండ్ ఇప్పుడు మరో మోడల్ లాంచ్ చేసింది. క్రిటిక్స్ దగ్గర కూడా కంపెని సొంత కిరిన్ ప్రొసెసర్ మంచి స్కోరింగ్ తెచ్చుకోవటం తో అన్ని బడ్జెట్ సెగ్మెంట్ యూజర్స్ honor ఫోనులను ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు.
తాజాగా లాంచ్ అయిన మోడల్ పేరు హానర్ 4A. రెండు వెర్షన్స్ లో చైనా లో లాంచ్ అయిన దీని ధర దాదాపు 6,000(3g) మరియు 7,000 (4g) ఉండనుంది. ప్రస్తుతం ఇది చైనా లో సేల్ అవుతుంది. గతంలో కంపెని లాంచ్ చేసిన మోడల్స్ ఉదాహరణకు తీసుకుంటే హానర్ 4A కూడా ఇండియాలో లాంచ్ అవుతుంది.
హానర్ 4A స్పెసిఫికేషన్స్ –
5in 720 x 1280 పిక్సెల్స్ HD డిస్ప్లే, క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 210 1.1GHz SoC, 2GB ర్యామ్, 8MP రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, డ్యూయల్ సిమ్, 2200 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 దీని Key స్పెక్స్