Honor 200 Series: సినిమాటిక్ కెమెరాతో కొత్త సిరీస్ వస్తోంది.!
హానర్ కొత్తస్మార్ట్ ఫోన్ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది
హానర్ 200 సిరీస్ 5జి ఫోన్ లను త్వరలో విడుదల చేస్తోంది
పీస్ ఆఫ్ ఆర్ట్ పేరుతో ఈ ఫోన్ ను పిలుస్తోంది
Honor 200 Series: ఇండియాలో హానర్ కొత్తస్మార్ట్ ఫోన్ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అదే, హానర్ 200 సిరీస్ 5జి మరియు ఈ ఫోన్ లను అద్భుతమైన సినిమాటిక్ కెమెరాతో తీసుకొస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, పీస్ ఆఫ్ ఆర్ట్ పేరుతో ఈ ఫోన్ ను పిలుస్తోంది. అంటే, ఈ ఫోన్ డిజైన్ ను కలిగి ఉంటుందని చెప్పకనే చెబుతోంది.
Honor 200 Series:
హానర్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫోన్ లను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. హానర్ 200 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ లను గొప్ప కెమెరా సెన్సార్ మరియు దానికి తగిన సాఫ్ట్ వేర్ తో తీసుకు వస్తుందని చెబుతోంది. ఈ ఫోన్ లో కటింగ్ ఎడ్జ్ డిస్ప్లే టెక్నాలజీ ఉన్నట్లు హానర్ తెలిపింది. అయితే, వాస్తవానికి ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్లను ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో హానర్ విడుదల చేసింది. ఇప్పుడు ఇవే ఫోన్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు భావిస్తున్నారు.
Also Read: వెంటనే Mobile Recharge చేయండి.. లేదంటే రేపటి నుంచి వీపు విమానం మోత మోగిపోద్ది.!
Honor 200 Series: ఫీచర్లు (గ్లోబల్)
హానర్ 200 సిరీస్ నుండి గ్లోబల్ మార్కెట్ లో హానర్ 200 మరియు హానర్ 200 ప్రో రెండు ఫోన్లు విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా న్యూ స్టైల్ రియర్ కెమెరా బంప్ సెటప్ తో వచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడా చూడచక్కని డిజైన్ మరియు గొప్ప కెమెరా సెటప్ ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాడ్ కర్వ్డ్ ఫ్లోటింగ్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్, 4K రికార్డింగ్ మరియు గొప్ప ఫోటోలను చిత్రించగల గొప్ప కెమెరాలను కలిగి ఉంటుంది.
ఇదే కాదు ఈ సిరీస్ ఫోన్ లలో వేగవంతమైన 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది మరియు 5100 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది. నిజం చెప్పాలంటే ఈ ఫోన్ సిరీస్ వాటి అందమైన డిజైన్ తో పాటు వేగవంతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వున్న కెమెరా కూడా ప్రత్యేకమైనది మరియు గొప్ప క్వాలిటీ పిక్చర్ లను అందిస్తుంది. ఇదంతా కూడా గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన హానర్ 200 సిరీస్ ఫోన్ ల ప్రత్యేకత.
భారత్ లో ఇదే ఫోన్ ను విడుదల చేస్తుందో లేక ఏదైనా మార్పులు చేస్తుందో అని వేచి చూడాల్సి వస్తుంది.