Honor 200 Lite 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల ఇండియాలో విడుదల చేసింది. హానర్ 200 సిరీస్ నుంచి ముందుగా ప్రీమియం మరియు మిడ్ రేంజ్ ఫోన్ లను విడుదల చేసిన హానర్, ఇప్పుడు బడ్జెట్ కేటగిరిలో ఈ కొత్త హానర్ 200 లైట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను లాంచ్ ఆఫర్లతో బడ్జెట్ ధరలో అందించినా, ఈ ఫోన్ లో మాత్రం ఆకట్టుకునే ఫీచర్స్ అందించింది.
హానర్ ఈ కొత్త ఫోన్ ను రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకు అందించింది. అయితే, ఈ ఫోన్ ను SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 15,999 ధరకే అందుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పార్రంభ తేదీ అయిన సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా మరియుexplorehonor.com నుంచి సేల్ అవుతుంది.
హానర్ ఈ ఫోన్ ను 6.78mm మందంతో చాలా స్లీక్ డిజైన్ తో అందించింది మరియు ఈ ఫోన్ కేవలం 166 గ్రాముల బరువుతో చాలా లైట్ గా ఉంటుంది. ఈ ఫోన్ 200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ ను FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ హానర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ SGS 5-star Drop రెసిస్టెంట్ సర్టిఫికేషన్ తో వస్తుంది.
Also Read: AI ప్రోసెసర్ తో Vu GLOLED 2025 సిరీస్ నుంచి మూడు కొత్త Smart Tv లు లాంచ్.!
ఈ హానర్ స్మార్ట్ ఫోన్ ను Dimensity 6080 5జి చిప్ సెట్ తో అందించింది. ఈ చిప్ సెట్ కి జతగా 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ తో కలిపి ఓవరాల్ 16GB ర్యామ్ తో పాటు 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ హానర్ ఫోన్ 4500 mAh బ్యాటరీని 35W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంది.
ఈ ఫోన్ 108MP మెయిన్ + 5MP వైడ్ & డెప్త్ + 2MP మ్యాక్రో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 50MP సెల్ఫీ కెమెరా కలిగి వుంది. ఈ ఫోన్ HDR మరియు Hi Res ఫోటోలు మరియు 1080p వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ తో గొప్ప పోర్ట్రైట్ ఫోటోలు మరియు AI వైడ్ సెల్ఫీ లను పొందవచ్చని హానర్ తెలిపింది.