Honor 200 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ 50MP స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరాలతో వస్తోంది.!
Honor 200 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తోంది హానర్
ఈ స్మార్ట్ ఫోన్ ముందుగా గ్లోబల్ మార్కెట్ లో విడుదల అయ్యింది
సూపర్ కెమెరా సెటప్ మరియు AI పవర్ ఫీచర్లతో లాంచ్ చేయబోతున్నట్లు హానర్ ఆటపట్టిస్తోంది
Honor 200 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తోంది హానర్. ఈ స్మార్ట్ ఫోన్ ముందుగా గ్లోబల్ మార్కెట్ లో విడుదల అయ్యింది. ఈ ఫోన్ ట్రిపుల్ 50MP స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరాలతో వస్తోంది. ఈ ఫోన్ ను చూడచక్కని డిజైన్, సూపర్ కెమెరా సెటప్ మరియు AI పవర్ ఫీచర్లతో లాంచ్ చేయబోతున్నట్లు హానర్ ఆటపట్టిస్తోంది.
Honor 200 5G లాంచ్ మరియు టీజ్ ఫీచర్లు
హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ జూలై 18వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ ఫోన్ ను సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. అంటే, ఈ ఫోన్ పైన గొప్ప అమెజాన్ సేల్ ఆఫర్ లను అందించే అవకాశం వుంది.
ఇక ఈ ఫోన్ టీజ్ స్పెక్స్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ గొప్ప డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ 50 MP స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో Netflix HDR మరియు Amazon HDR సర్టిఫికేషన్ కలిగిన 6.7 ఇంచ్ డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX906 మెయిన్ + 50MP Sony IMX856 టెలీ ఫోటో కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కెమెరాతో DSLR వంటి అద్భుతమైన పోర్ట్రైట్ లను షూట్ చేసే అవకాశం ఉందని హానర్ తెలిపింది. గొప్ప ఫోటోలు మరియు వీడియోలను అందించడానికి ఈ ఫోన్ లో హానర్ AI పోర్ట్రైట్ ఇంజిన్ ను కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో మరిన్ని AI కెమెరా ఫీచర్లు ఉన్నట్లు కూడా హానర్ తెలిపింది.
Also Read: TECNO SPARK 20 PRO 5G ఫోన్ ను ప్రీమియం డిజైన్ తో బడ్జెట్ ధరలో విడుదల చేసింది.!
హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ ఫోన్ ను క్లాసిక్ బ్లాక్ మరియు మూన్ లైట్ వైట్ రెండు కలర్ ఆప్షన్ లలో విడుదల చేస్తుందని హానర్ తెలిపింది.