Honor 200 5G: స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరాతో మిడ్ రేంజ్ ధరలో వచ్చింది.!

Honor 200 5G: స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరాతో మిడ్ రేంజ్ ధరలో వచ్చింది.!
HIGHLIGHTS

హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది

ఈ ఫోన్ ను స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరాతో మిడ్ రేంజ్ ధరలో అందించింది

ఈ ఫోన్ తో స్టూడియో లెవల్ పోర్ట్రైట్ ఫోటోలను కూడా పొందవచ్చని హానర్ తెలిపింది

Honor 200 5G: హానర్ గత కొంత కాలంగా ఆటపట్టిస్తున్న హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను ముందుగా గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన హానర్, ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరాతో మిడ్ రేంజ్ ధరలో అందించింది. 20వ తేదీ ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ ఫోన్ సేల్ మోదలవుతుంది.

Honor 200 5G : ఫీచర్లు

హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ ను 6.7 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120 రిఫ్రెష్ రేట్ మరియు 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ Netflix HDR మరియు Amazon HDR సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ 5జి చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 512GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది.

Honor 200 5G Features
Honor 200 5G Features

ఈ ఫోన్ కెమెరా సెటప్ గురించి చాలా గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP (Sony IMX906) మెయిన్ కెమెరా, 50MP (Sony IMX856) టెలిఫోటో కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో ఉన్న ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాతో 4K వీడియోలు మరియు స్టూడియో లెవల్ పోర్ట్రైట్ ఫోటోలను కూడా పొందవచ్చని హానర్ తెలిపింది.

ఈ హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ AI పవర్డ్ Magic OS 8.0 సాఫ్ట్ వేర్ పైన పని చేస్తుంది మరియు చాలా AI ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5200mAh హెవీ బ్యాటరీ మరియు 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వుంది.

Also Read: Dyson OnTrac Headphone: కొత్త టెక్నాలజీతో హెడ్ ఫోన్స్ విడుదల చేసిన డైసన్.!

Honor 200 5G: ప్రైస్

హానర్ ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ను 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ. 32,999 రూపాయల ధరలో ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క 12GB + 512GB వేరియంట్ ను రూ. 39,999 ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ మూన్ లైట్ వైట్ మరియు బ్లాక్ రెండు కలర్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ పైన రూ. 8,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ తో అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు SBI కార్డ్స్ తో కొనేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo