హానర్ 10 లైట్ విడుదల : జనవరి 15 న ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా
హానర్ 9 లైట్ వారసునిగా రానున్న హానర్ 10 లైట్.
ముఖ్యాంశాలు:
1. జనవరి 15 న భారతదేశంలో హానర్ 10 లైట్ విడుదలకానుంది
2. ఈ ఫోన్ డ్యూ-డ్రాప్ నోచ్ తో వస్తుంది
3. హానర్ 9 లైట్ వారసునిగా రానున్న హానర్ 10 లైట్.
జనవరి 15 న, హువావే యొక్క ఉప బ్రాండ్ అయినటువంటి హానర్ తన 10 లైట్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా, ఈ సంస్థ దానికి సంబంధించి మీడియాకు ఆహ్వానాలను కూడా పంపింది మరియు ఫ్లిప్ కార్ట్ మైక్రోసాైట్లో ఈ స్మార్ట్ ఫోన్నుజాబితా కూడా చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనాలో ప్రారంభించబడింది మరియు ఒక డ్యూ-డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఇది 91 శాతం స్క్రీన్ -టూ-బాడీ నిష్పత్తిని పొందడానికి ఒక సాధారణ నోచ్ తో, ఈ సంస్థ నుండి భారతదేశంలో ప్రవేశపెట్టనున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్.
ఇది హానర్ 9 లైట్ యొక్క వారసుడుగా, ఈ హానర్ 10 లైట్ కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత కెమెరాను కలిగి ఉంటుంది. చైనాలో మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టారు, కానీ ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్ ప్రకారం, కంపెనీ 4G RAM RAM మరియు 64 GB స్టోరేజి వేరియంట్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టవచ్చని సూచిస్తుంది. ఈ ఫోన్ ఎరుపు, నీలం, నలుపు మరియు తెలుపు, వంటి నాలుగు రంగులలో తీసుకువచ్చారు,కానీ ఫ్లిప్ కార్టులో మాత్రం,గ్రేడియంట్ కలరుతో వుండే ఒక స్కై బ్లూ వేరియంటుతో పాటుగా మూడు రంగులు మాత్రమే కనిపిస్తాయి.
హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్లను
ఈ హానర్ 10 లైట్ ఒక 6.51 అంగుళాల IPS LCD ఫుల్ HD + డిస్ప్లేను, 2280 x 1080 పిక్సెళ్లతో 19.5: 9 ఆస్పెక్ట్ రేషియాతో అందిస్తుంది. ఈ డివైజ్ HiSilicon Kirin 710 చిప్‌సెట్‌ను కలిగివుంది. అయితే, 16nm కిరిన్ 659 తో పోలిస్తే, ఈ కిరిన్ 710 సింగిల్ కోర్ యొక్క పనితీరు కిరిన్ 659 కంటే 75 శాతం అధికంగా నిలుస్తోందని ఈ సంస్థ చెబుతోంది. ఈ కిరిన్ 710ప్రాసెసర్, కిరిన్ 659 కంటే విద్యుత్ వినియోగం మరియు పెరఫార్మెన్స్ లో అభివృద్ధి సాధించింది మరియు ఇది Antutu పైన 131733 పాయింట్లు సాధించింది.
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక ప్యానెల్లో వేలిముద్ర సెన్సార్‌ను కలిగివుంటుంది. కెమెరా విభాగంలో, ఈ ఫోన్ 13MP ప్రాధమిక సెన్సార్ మరియు ఒక 2MP సెకండరీ సెన్సారుతో, వెనుక డ్యూయల్-కెమెరా సెటప్పును కలిగివుంటుంది. సెల్ఫీ కోసం, AI సామర్థ్యాలతో 24MP ముందు షూటర్ ఉంది. ఈ డివైజ్ GPU టర్బోతో వస్తుంది, ఇది 60 శాతం వరకు గ్రాఫిక్స్ పనితీరు మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ మొత్తం ప్యాకేజీ, ఒక 3,400mAh బ్యాటరీతో శక్తిని కలిగి ఉంది.