HMD గ్లోబల్ తన నోకియా 6.1 ప్లస్ ని విడుదల చేయడానికి ఆగష్టు 21 ని నిర్ణయించాలని చూస్తుంది

HMD గ్లోబల్ తన నోకియా 6.1 ప్లస్ ని విడుదల చేయడానికి ఆగష్టు 21 ని నిర్ణయించాలని చూస్తుంది
HIGHLIGHTS

HMD గ్లోబల్ ఆగష్టు 21 వ తేదీని షెడ్యూల్ చేసిన ఒక కార్యక్రమానికి మీడియా ఆహ్వానాలను పంపించింది. ఈ కంపెనీ నోకియా 6.1 ప్లస్ ని ఈ కార్యక్రమంలో ప్రకటించనుంది అను అంచనా.

ఇంటర్నెట్ ప్రసారం చేస్తున్న ఈ సమాచారం నమ్మకమైనదే అయితే , ఆగష్టు 21 న నోకియా షెడ్యూల్ చేయబడిన ఒక కార్యక్రమంలో  భారతదేశంలో నోకియా 6.1 ప్లస్ ని ప్రకటించనుంది. మీడియా ఈవెంట్ ఆహ్వానం ఏంచెబుతుందంటే, "HMD గ్లోబల్ ప్రత్యేక సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది తరువాతి జెన్ ఆవిష్కరణ కోసం. " ప్రపంచవ్యాప్తంగా నోకియా 6X గా పిలిచే పరికరం నోకియా 6.1 ప్లస్ అయ్యి ఉంటుంది అని వదంత కారులు పుకార్లు వినిపిస్తున్నారు.

 

నోకియా 6.1 ప్లస్ స్పెసిఫికేషన్స్

 

నోకియా 6.1 ప్లస్ యొక్క స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుతూ, డ్యూయల్ – సిమ్  స్మార్ట్ ఫోన్ బాక్స్ నుండి బయటకు వస్తూనే ఆండ్రాయిడ్ ఒరెయో  తో పనిచేస్తుంది. నోకియా ఫోన్లు స్టాక్ ఆండ్రాయిడ్ ద్వారా  పనిచేస్థాయి మరియు ఇది నోకియా 6.1 ప్లస్ కోసం వేరైనదని మేము భావించడం లేదు. ఈ డివైజ్ 19: 9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన 1080 x 2280 పిక్సల్స్ రిజల్యూషన్ గా కలిగిన 5.8 అంగుళాల పూర్తి హెచ్ డి +  డిస్ప్లేను కలిగి ఉంది. ఏ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3  రక్షణతో  ఉంది.

 నోకియా 6.1 ప్లస్ స్నాప్ డ్రాగన్ 636 SoC, 4జీబీ / 6జీబీ  ర్యామ్ తో అనుసంధానమవుతుంది. స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 16ఎంపీ  +  5ఎంపీ తో డ్యూయల్ – కెమెరా సెటప్ ఉంటుంది, అయితే ముందు భాగంలో సెల్ఫీల కోసం  16ఎంపీ  కెమెరా ఉంటుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 32జీబీ/64జీబీ  అంతర్గత మెమొరీలతో పాటుగా  స్టోరేజీ విస్తరించగల స్మార్ట్ ఫోన్. ఒక 3060mAh బ్యాటరీ మొత్తం ప్యాకేజీకి అసరిపడి శక్తినందిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లభ్యత గురించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు, కానీ ఈ స్మార్ట్ ఫోన్ లభ్యత కోసం ఆన్లైన్ రిటైలర్ల తో ఒప్పందం చేసుకుంటుందని   ఆశిస్తున్నాము.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo