నోకియా కంపెనీ యొక్క ఐకానిక్ ఫోన్ గా Nokia 3210 కి మంచి గుర్తింపు వుంది. ఈ ఫోన్ ను 1999 లో కంపెనీ విడుదల చేసింది మరియు ఈ ఫోన్ ఉనికిలోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. అందుకే, సిల్వర్ జూబ్లీ కానుకగా ఈ ఫోన్ ను నేటి తరానికి సరిపడేలా కొత్త టచ్ మరియు ఫీచర్ లతో అందించింది. ఈ ఫీచర్ ఫోన్ కొత్త స్టైలిష్ లుక్ మరియు కలర్ ఆప్షన్ లలో కూడా లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు మరో రెండు కొత్త ఫోన్ కూడా విడుదల చేసింది.
నోకియా 3210 ఫీచర్ ఫోన్ ను రూ. 3,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ అమెజాన్, HMD అధికారిక సైట్ మరియు అన్ని ప్రధాన అవుట్ లెట్స్ లో లభిస్తుంది. ఈ నోకియా ఫీచర్ ఫోన్ గ్రంజ్ బ్లాక్, స్కూబా బ్లూ మరియు వై2కె గోల్డ్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. Buy From Here
HDM రీ లాంచ్ చేసిన ఈ నోకియా ఫీచర్ ఫోన్ కొత్త క్లాసిక్ కీ ప్యాడ్ తో వస్తుంది. ఈ ఫీచర్ ఫోన్ 4G సపోర్ట్ తో వస్తుంది మరియు ఆకర్షణీయమైన కొత్త లుక్ లో వచ్చింది. ఈ నోకియా ఫోన్ YouTube, Scan & Pay UPI ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో వెనుక రియర్ కెమెరా కూడా వుంది.
HMD అందించిన ఈ నోకియా ఫీచర్ ఫోన్ MP3 ప్లేయర్ మరియు వైర్లెస్ FM ఫీచర్ లను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో బ్లూటూత్ 5.0 మరియు USB టైప్ C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ను 2.4 ఇంచ్ పెద్ద స్క్రీన్ తో అందించింది.
Also Read: MagSafe 2-in-1 వైర్లెస్ చార్జర్ స్టాండ్ ను లాంచ్ చేసిన అంబ్రేన్.!
ఈ ఫోన్ తో పాటుగా Nokia 235 4G ఫీచర్ ఫోన్ ను కూడా HMD అందించింది. ఈ ఫోన్ ను రూ. 3,749 ధరతో అందించింది. ఈ ఫోన్ ను కూడా 4G సపోర్ట్, రియర్ కెమెరా, UPI స్కాన్ అండ్ పే మరియు 2.8 ఇంచ్ బిగ్ డిస్ప్లేతో అందించింది. ఈ ఫోన్ కూడా అమెజాన్ మరియు HMD అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తోంది. Buy From Here