25 సంవత్సరాల క్రితం 1999 సంవత్సరంలో నోకియా అందించిన నోకియా 3210 స్మార్ట్ ఫోన్ కొత్త వెర్షన్ Nokia 3210 4G ను HMD ఇండియా లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్, డిస్ప్లే మరియు ఫీచర్స్ పరంగా కూడా 2024 కు తగిన విధంగా అందించింది. Y2K నుండి ఒరిజినల్ రిటర్న్ ఫోన్, నేటి కాలంతో నూతనంగా మారింది, అనే ట్యాగ్ లైన్ తో కంపెనీ ఈ ఫోన్ ను పరిచయం చేసింది.
నోకియా 3210 4జి స్మార్ట్ ఫోన్ ను రూ. 3,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ Amazon మరియు HMD అధికారిక వెబ్సైట్ ద్వారా ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ వై2కె గోల్డ్, స్కూబా బ్లూ మరియు గ్రంజ్ బ్లాక్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. Buy From Here
నోకియా 3210 4జి ఫీచర్ ఫోన్ ను కొత్త మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ లో 2.4 ఇంచ్ బిగ్ QVGA డిస్ప్లే ఉంది మరియు ఇది డ్యూయల్ 4G SIM సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ మరియు బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో ఉంటుంది. ఈ నోకియా కొత్త ఫీచర్ ఫోన్ లో 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరీ 9.8 గంటల వరకూ కాలింగ్ అందిస్తుందని కంపెనీ హింట్ ఇచ్చింది.
ఈ ఫోన్ Unisoc T107 తో పని చేస్తుంది మరియు 64MB ర్యామ్ / 128 MB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఒక ప్రత్యేకమైన మైక్రో SD కార్డుతో ఈ ఫోన్ స్టోరేజ్ ను 32GB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో MP3 ప్లేయర్ మరియు వైర్లెస్ FM రేడియో సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ నోకియా ఫోన్ ఒక స్పీకర్ మరియు ఒక మైక్రోఫోన్ తో వస్తుంది.
Also Read: కొత్త QLED 4K Smart Tv లను విడుదల చేసిన Samsung.. ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
ఈ నోకియా ఫీచర్ ఫోన్ లో అందించిన క్లౌడ్ యాప్ పోర్టల్ నుండి న్యూస్, వాతావరణ అప్డేట్స్ మరియు యూట్యూబ్ వీడియోలను కూడా వీక్షించవచ్చు. అంతేకాదు, ఇందులో నోకియా బెస్ట్ గేమ్ గా అందరికీ పరిచయం ఉన్న స్నేక్ గేమ్ కూడా వుంది. ఈ ఫోన్ లో 2MP డిజిటల్ కెమెరా మరియు UPI పేమెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
కొత్త ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్న వారి లిస్ట్ లో ఈ నోకియా ఫోన్ కూడా ఒక కొత్త ఆప్షన్ అవుతుంది.