Nokia 3210 4G ను కొత్త టచ్ తో విడుదల చేసిన HMD.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
నోకియా 3210 స్మార్ట్ ఫోన్ కొత్త వెర్షన్ Nokia 3210 4G ను HMD లాంచ్ చేసింది
నోకియా 3210 4జి ఫీచర్ ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్ తో అందించింది
ఈ ఫోన్ లో 2MP డిజిటల్ కెమెరా మరియు UPI పేమెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి
25 సంవత్సరాల క్రితం 1999 సంవత్సరంలో నోకియా అందించిన నోకియా 3210 స్మార్ట్ ఫోన్ కొత్త వెర్షన్ Nokia 3210 4G ను HMD ఇండియా లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్, డిస్ప్లే మరియు ఫీచర్స్ పరంగా కూడా 2024 కు తగిన విధంగా అందించింది. Y2K నుండి ఒరిజినల్ రిటర్న్ ఫోన్, నేటి కాలంతో నూతనంగా మారింది, అనే ట్యాగ్ లైన్ తో కంపెనీ ఈ ఫోన్ ను పరిచయం చేసింది.
Nokia 3210 4G: ప్రైస్
నోకియా 3210 4జి స్మార్ట్ ఫోన్ ను రూ. 3,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ Amazon మరియు HMD అధికారిక వెబ్సైట్ ద్వారా ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ వై2కె గోల్డ్, స్కూబా బ్లూ మరియు గ్రంజ్ బ్లాక్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. Buy From Here
Nokia 3210 4G: ప్రతేకతలు
నోకియా 3210 4జి ఫీచర్ ఫోన్ ను కొత్త మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ లో 2.4 ఇంచ్ బిగ్ QVGA డిస్ప్లే ఉంది మరియు ఇది డ్యూయల్ 4G SIM సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ మరియు బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో ఉంటుంది. ఈ నోకియా కొత్త ఫీచర్ ఫోన్ లో 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరీ 9.8 గంటల వరకూ కాలింగ్ అందిస్తుందని కంపెనీ హింట్ ఇచ్చింది.
ఈ ఫోన్ Unisoc T107 తో పని చేస్తుంది మరియు 64MB ర్యామ్ / 128 MB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఒక ప్రత్యేకమైన మైక్రో SD కార్డుతో ఈ ఫోన్ స్టోరేజ్ ను 32GB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో MP3 ప్లేయర్ మరియు వైర్లెస్ FM రేడియో సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ నోకియా ఫోన్ ఒక స్పీకర్ మరియు ఒక మైక్రోఫోన్ తో వస్తుంది.
Also Read: కొత్త QLED 4K Smart Tv లను విడుదల చేసిన Samsung.. ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
ఈ నోకియా ఫీచర్ ఫోన్ లో అందించిన క్లౌడ్ యాప్ పోర్టల్ నుండి న్యూస్, వాతావరణ అప్డేట్స్ మరియు యూట్యూబ్ వీడియోలను కూడా వీక్షించవచ్చు. అంతేకాదు, ఇందులో నోకియా బెస్ట్ గేమ్ గా అందరికీ పరిచయం ఉన్న స్నేక్ గేమ్ కూడా వుంది. ఈ ఫోన్ లో 2MP డిజిటల్ కెమెరా మరియు UPI పేమెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
కొత్త ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్న వారి లిస్ట్ లో ఈ నోకియా ఫోన్ కూడా ఒక కొత్త ఆప్షన్ అవుతుంది.