HMD Fusion స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!

Updated on 25-Nov-2024
HIGHLIGHTS

HMD Fusion స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది

ఈ ఫోన్ ను గొప్ప ఫీచర్స్ కలిగిన గేమింగ్ ప్యాడ్ తో అటాచ్ చేసుకునే విధంగా అందించారు

సరికొత్త ఇన్నోవేటివ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో విడుదల చేసింది

HMD Fusion స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త ఇన్నోవేటివ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను గొప్ప ఫీచర్స్ కలిగిన గేమింగ్ ప్యాడ్ తో అటాచ్ చేసుకునే విధంగా అందించారు. ఈ కొత్త సెటప్ ఈ ఫోన్ ను మార్కెట్లో ఉన్న ఇతర ఫోన్ లతో వేరుగా ఉండే విధంగా మార్చింది. హెచ్ఎండి లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్, స్పెక్స్ మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకుందామా.

HMD Fusion : ప్రైస్

హెచ్ఎండి ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను రూ. 17,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై అందించింది ఇంట్రడక్టరి లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ లో భాగంగా రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరకే ఈ ఫోన్ ను లిమిటెడ్ కాలానికి అందిస్తుంది. అంటే, స్టార్టింగ్ సేల్ నుంచి ఈ ఫోన్ ను ఈ ఆఫర్ ధరకు అందుకునే అవకాశం అందించింది.

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ నవంబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ HMD ఇండియా వెబ్సైట్ మరియు అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

HMD Fusion : ఫీచర్స్

హెచ్ఎండి ఈ కొత్త ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 4 Gen 2 తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ తో టోటల్ 16GB ఫీచర్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.56 ఇంచ్ HD+ స్క్రీన్ వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS పై నడుస్తుంది మరియు 2 OS అప్గ్రేడ్ లను అందుకుంటుంది.

ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 108MP మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ మరియు గేమింగ్ ప్యాడ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు కూడా వుంది.

Also Read: BSNL: బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ అందించే బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్.!

ఈ ఫోన్ ను గేమింగ్ అవుట్ ఫిట్స్ తో కనెక్ట్ చేసి గొప్ప గేమింగ్ మరియు ఇందులో ఉన్న పెద్ద LED లైట్ తో గొప్ప కెమెరా ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందని హెచ్ఎండి తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ను యూజర్ సొంతంగా రిపేర్ చేసుకునేలా సింపుల్ సెటప్ తో సెల్ఫ్ రిపేర్ ఫోన్ గా కూడా అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :